ఇండియా పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య, గత శనివారం ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. దింతో భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు అంటే సోమవారం భారీగా విజృంభించాయి. ఉదయం 10 గంటలకు బిఎస్‌ఇ సెన్సెక్స్ 2,376 పాయింట్లు అంటే 2.88% పెరిగి 81,830.65కి చేరగా, నిఫ్టీ50 705 పాయింట్లు అంటే 2.94% పెరిగి 24,713 పాయింట్లకు చేరుకుంది. అయితే గత శుక్రవారం భారీ పతనాన్ని చూసిన సెన్సెక్స్-నిఫ్టీ, నేడు మాత్రం మంచి జోష్'తో ప్రారంభమైంది. భారతదేశం పాకిస్థాన్ కాల్పుల విరమణ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించిందని నిపుణులు అంటున్నారు. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులపై భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే.

705 పాయింట్లు లాభపడిన నిఫ్టీ : నిఫ్టీ ఇండెక్స్ ఇవాళ 706.6 పాయింట్లు పెరిగి 24,714.6 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో 49 కంపెనీల షేర్లు గ్రీన్ మార్క్‌లో ఉన్నాయి, అంటే ఈ షేర్లు పెరిగాయి.
రాకెట్ల దూసుకెళ్తున్న ఈ స్టాక్‌లు : స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న బిగ్ బూమ్ మధ్య దూసుకెళ్తున్న లార్జ్-క్యాప్ కంపెనీల షేర్లలో టాప్-10 స్టాక్‌లలో చూస్తే యాక్సిస్ బ్యాంక్ (4%), అదానీ పోర్ట్స్ (3.88%), బజాజ్ ఫిన్‌సర్వ్ (3.75%), ఎటర్నల్ షేర్ (3.61%), బజాజ్ ఫైనాన్స్ షేర్ (3.61%), NTPC షేర్ (3.50%), టాటా స్టీల్ షేర్ (3.40%), రిలయన్స్ షేర్ (3.23%), ICICI బ్యాంక్ షేర్ (2.90%), HDFC బ్యాంక్ షేర్ (2.85%) ఉన్నాయి.
మిడ్‌క్యాప్ అండ్ స్మాల్‌క్యాప్ స్టాక్‌ల గురించి మాట్లాడుకుంటే, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో చేరిన ఎస్కార్ట్స్ షేర్ (7.63%), సుజ్లాన్ షేర్ (7.32%), ఫస్ట్ క్రై షేర్ (7.22%), డిక్సన్ టెక్ షేర్ (6.40%), RVNL షేర్ (6.30%), IREDA షేర్ (5.43%) అధికంగా ట్రేడవుతున్నాయి. స్మాల్‌క్యాప్ విభాగంలో పంజాబ్ కెమికల్ (13%) ఇంకా కెపిఇఎల్ 10% లాభంతో ట్రేడవుతున్నాయి.
గత శుక్రవారం భారీ తగ్గుదల : గత వారం చివరి రెండు ట్రేడింగ్ రోజుల్లో భారత స్టాక్ మార్కెట్ తీవ్రమైన క్షీణతను చూసింది. గడిచిన శుక్రవారం బిఎస్ఇ సెన్సెక్స్ ముందు రోజు ముగింపు 80,334.81 నుండి పడిపోయింది. దింతో 78,968 స్థాయిలో ట్రేడింగ్ ప్రారంభించి రోజంతా రెడ్ జోన్‌లో ట్రేడింగ్ కొనసాగించింది. చివరికి మార్కెట్ ముగిసే సమయానికి క్షీణత తగ్గినప్పటికీ 880.34 పాయింట్లు లేదా 1.10 శాతం పడిపోయి 79,454.47 వద్ద ముగిసింది. సెన్సెక్స్ లాగే NSE నిఫ్టీ కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 265.80 పాయింట్లు లేదా 1.10% తగ్గి 24,008 వద్ద ముగిసింది.
కాల్పుల విరమణ తర్వాత శుభ సంకేతాలు: ఇండో-పాక్ కాల్పుల విరమణ తర్వాత స్టాక్ మార్కెట్‌కు విదేశాల నుండి మంచి సంకేతాలు అందుతున్నాయి, దీని ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వారంలో మొదటి ట్రేడింగ్ రోజు సోమవారం చాలా ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ప్రారంభ ట్రేడింగ్‌లో 525 పాయింట్లు పెరిగి 24,610 స్థాయికి చేరుకుంది.
More From GoodReturns

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. గంటల వ్యవధిలో రూ. 9 లక్షల కోట్లు ఆవిరి.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు..

Stock market: తిరిగి పుంజుకున్న ఐటీ షేర్లు! బుల్ రన్ ఇలాగే కొనసాగుతుందా?

ఇరాన్ యుధ్దం.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న స్టాక్స్ ఇవే.. ఓ కన్నేసి ఉంచండి..

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications