భారతదేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాలపై ఇటీవల సైబర్ దాడులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ దాడులు దేశంలో అత్యంత రద్దీగా ఉన్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ వంటి విమానాశ్రయాలను ప్రభావితం చేశాయి. ఈ సంఘటనల కారణంగా విమానాల నావిగేషన్ వ్యవస్థల్లో తాత్కాలిక సమస్యలు కనిపించాయి. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడుల్లో ప్రధానంగా GPS స్పూఫింగ్ అనే సాంకేతిక పద్ధతి ఉపయోగించబడింది. ఇది నిజమైన ఉపగ్రహ GPS సంకేతాల స్థానంలో నకిలీ సంకేతాలను పంపి, విమానాలను వాటి వాస్తవ స్థానం, దిశ, ఎత్తు గురించి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది.
పార్లమెంట్ లో పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరపు మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్న కొన్ని విమానాలు రన్‌వే 10 వైపు ల్యాండింగ్‌కు వస్తున్న సమయంలో GPS స్పూఫింగ్ ప్రభావాన్ని ఎదుర్కొన్నాయని పైలట్లు నివేదించారని చెప్పారు. విమానాల నావిగేషన్ సిస్టమ్ కి తప్పు సమాచారం చేరడం వల్ల ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు అత్యవసర ప్రక్రియలను వెంటనే అమలు చేశాయి.

ఇలాంటి ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచినా.. ఈ కారణంగా ఒక్క విమానం కూడా రద్దు కాలేదని, విమానాల ల్యాండింగ్ లేదా టేకాఫ్ వ్యవస్థలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదని ప్రభుత్వం తెలిపింది. బాకప్ నావిగేషన్ సిస్టమ్స్, ATC అత్యవసర రక్షణ చర్యలతో విమానాలు సురక్షితంగా నడిచాయని స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, విమానాశ్రయ భద్రతా బృందాలు సమయానికి స్పందించాయని తెలిపింది.
అయితే.. కీలకమైన రవాణా మౌలిక సదుపాయాలపై ఇలాంటి Cyber దాడులు జరగడం దేశ సైబర్ భద్రతా వ్యవస్థల్లో నిర్లక్ష్యాన్ని బయటపెడుతుంది. ముఖ్యంగా దేశంలోని అత్యంత రద్దీగా ఉండే విమాన రవాణా కేంద్రాలు లక్ష్యంగా మారడం ఆందోళనకర విషయం. ఇటీవలే ఢిల్లీ విమానాశ్రయంలో మరో సాంకేతిక లోపం కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యమైన సంఘటన నేపథ్యంలో ఈ కొత్త దాడి మరింత ఆందోళనను కలిగించింది. వాస్లవానికి అది సైబర్ దాడి కాదని, కేవలం AMSS వ్యవస్థలో లోపమని తర్వాత వెల్లడైనా లోపాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సైబర్ దాడి కూడా అదే సమయంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే ఎయిర్‌బస్ A320 విమానాలకు అవసరమైన సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా దేశంలో దాదాపు 388 విమానాలు ప్రభావితం అయ్యాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయి. ఈ పరిణామాలు కలిసే చూస్తే, విమానయాన రంగంలో సాంకేతిక, సైబర్ ప్రమాదాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో స్పష్టమవుతోంది.
క్లుప్తంగా చెప్పాలంటే విమాన సర్వీసులు పెద్దగా దెబ్బతినకపోయినా, సైబర్ దాడులు భారత డిజిటల్ భద్రతా వ్యవస్థను మరింత బలపరచాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే సైబర్ మానిటరింగ్ పెంపుతో పాటు, బలమైన రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది. భవిష్యత్తులో విమాన నావిగేషన్ వ్యవస్థలు మరింత రక్షితంగా ఉండేలా ప్రత్యామ్నాయ సాంకేతిక పరిష్కారాలపై కూడా పరిశ్రమ దృష్టి పెట్టనుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications