ప్రస్తుతం నెలకొన్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ (iran israel war) పరిస్థితులు ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం , దానికి ప్రతిగా ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులతో అంతర్జాతీయ చమురు మార్కెట్ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) మార్గంలో అంతరాయం ఏర్పడుతుందనే భయాలు భారత్‌ను వణికిస్తున్నాయి.

భారత్‌కు ఎందుకు ముప్పు?
భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 50 శాతం అంటే రోజుకు సుమారు 2.6 మిలియన్ బ్యారెళ్లను ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. ఒకవేళ ఈ యుద్ధం కారణంగా ఈ సముద్ర మార్గం మూతపడితే, భారత్‌కు చమురు సరఫరా నిలిచిపోవడమే కాకుండా, దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. ప్రతి 10 డాలర్ల చమురు ధర పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెరగనున్న ధరలు.. తగ్గనున్న వృద్ధి!
కునాల్ సోధాని వంటి ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, చమురు ధరలు 25 శాతం పెరిగితే భారత దిగుమతి బిల్లుకు అదనంగా 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) భారం పడుతుంది. దీనివల్ల..
- ద్రవ్యోల్బణం: దేశంలో ధరలు 0.7 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
- జీడీపీ: భారత ఆర్థిక వృద్ధి రేటు (GDP) 0.2 శాతం తగ్గే ప్రమాదం ఉంది.
- కరెంట్ అకౌంట్ డెఫిసిట్: మన దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగి లోటు 0.3 శాతం పెరుగుతుంది.
ఏయే రంగాలపై ప్రభావం ఉంటుంది?
ముడి చమురు ధరలు పెరిగితే కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా అనేక రంగాలు ప్రభావితమవుతాయి..
- ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs): ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి కంపెనీల లాభాలు తగ్గుతాయి.
- ఏవియేషన్ & లాజిస్టిక్స్: విమాన ఇంధన ధరలు పెరగడం వల్ల ప్రయాణ ఖర్చులు భారమవుతాయి.
- పెయింట్స్ & ఆటోమొబైల్: ముడి పదార్థాల ధరలు పెరిగి ఈ కంపెనీల మార్జిన్లు పడిపోతాయి.
- ఐటీ రంగం: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత వల్ల ఐటీ స్టాక్స్‌లో ఒడిదుడుకులు రావచ్చు.
సౌదీ అరేబియా ఆశ కిరణం?
ప్రస్తుతానికి ఒపెక్ (OPEC+) దేశాల వద్ద అదనపు చమురు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అవసరమైతే ఉత్పత్తిని పెంచుతామని సౌదీ అరేబియా సూచనప్రాయంగా తెలిపింది. దీనివల్ల ధరలు ఒకేసారి పెరిగినా, ఎక్కువ కాలం అదే స్థాయిలో ఉండకపోవచ్చని ట్రేడ్‌బుల్స్ సెక్యూరిటీస్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే మాత్రం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం , ఖర్చు అవుతుంది.
సోమవారం మార్కెట్లపైనే అందరి కళ్లు
ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధం (iran israel war) నేపథ్యంలో సోమవారం మార్కెట్లు ప్రారంభమయ్యే సమయానికి తీవ్రమైన ఒడిదుడుకులు (Volatility) ఉండవచ్చు. కేవలం చమురు ధరలే కాకుండా, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న 90 లక్షల మంది భారతీయుల భద్రత , అక్కడి నుండి వచ్చే రెమిటెన్స్‌లు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం , ఆర్బీఐ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. యుద్ధం ముదిరితే మాత్రం సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
More From GoodReturns

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

పెట్రోల్, డీజిల్ పన్ను తగ్గింపు.. 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

Petrol prices: పెట్రోల్, డీజిల్‌పై రూ. 10 పన్ను తగ్గింపు.. అయినా సామాన్యులకు ఊరట లేదు! ఏందుకంటే..

LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?



Click it and Unblock the Notifications