Poverty in India: భారత్‌లో పేదరికంపై అమెరికా సంస్థ కీలక రిపోర్ట్.. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు..

Indian economy: భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పంచవర్ష ప్రణాళికల ప్రారంభం నుంచి ఇదే దిశగా ఆయా ప్రభుత్వాలు అడుగులు వేశాయి. అయితే ఎట్టకేలకు ఇప్పటికి ఇది సాధ్యమైనట్లు అమెరికన్ సంస్థ ప్రకటించింది.

స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు భారతదేశం తీవ్ర పేదరికాన్ని నిర్మూలించగలిగింది. 2022-23కి సంబంధించి విడుదల చేసిన వినియోగ వ్యయ(కన్సమ్ప్షన్ ఎక్పెండిచర్) డేటా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు ప్రముఖ అమెరికన్ థింక్-ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌ ఆర్థికవేత్తలు తెలిపారు. సుర్జిత్ భల్లా మరియు కరణ్ భాసిన్ ఈ మేరకు ఓ రిపోర్ట్ విడుదల చేశారు.

India officially eliminated extreme poverty

2011-12 నుంచి వాస్తవ తలసరి వినియోగం ఏడాదికి 2.9 శాతం పెరిగిందని ఈ ఇద్దరు ప్రముఖ ఆర్థికవేత్తలు వెల్లడించారు. పట్టణాభివృద్ధి (2.6 శాతం) కంటే గ్రామీణ వృద్ధి (3.1 శాతం) ఎక్కువగా ఉందని డేటాను ఉదహరించారు. భారీ వృద్ధి సహా అసమానతల తగ్గుదల భారత్‌లో పేదరిక నిర్మూలనకు దోహదపడినట్లు తేల్చారు.

నివేదిక ప్రకారం.. దారిద్య్ర రేఖకు దిగువన నివసించే జనాభా నిష్పత్తి 2011-12లో 12.2 శాతం నుంచి 2022-23 నాటికి 2 శాతానికి తగ్గింది. అంటే ఏడాదికి 0.93 శాతం క్షీణించింది. ఇందులో గ్రామీణ పేదరికం వాటా 2.5 శాతం ఉండగా, పట్టణ పేదరికం 1 శాతానికి తగ్గింది. జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల మందికి ప్రభుత్వం అందించే ఉచిత ఆహారం (గోధుమలు మరియు బియ్యం) లేదా ప్రజారోగ్యం మరియు విద్య వినియోగాన్ని ఈ అంచనాలు పరిగణనలోకి తీసుకోలేదని నివేదిక పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+