భారతీయ ఉద్యోగాల మార్కెట్‌కు సంబంధించి ఒక శుభవార్త వచ్చింది. అదేంటంటే.. కొత్త ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి 2026)లో దేశంలో నియామకాలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో బలమైన వృద్ధి అలాగే కంపెనీల విస్తరణ ప్రణాళికలు దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు, కెరీర్ మార్చుకోవాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఉద్యోగాల కల్పనలో భారత్ రెండో స్థానం
మ్యాన్‌పవర్ గ్రూప్ (ManpowerGroup) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నియామకాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న కంపెనీల నికర నిష్పత్తి (Net Employment Outlook - NEO)లో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో నిలిచింది. 2026 జనవరి-మార్చి త్రైమాసికానికి భారత్ NEO 52 శాతంగా నమోదైంది. ఇది గత త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు 2025) కంటే 27% అధికం. NEO 54%తో బ్రెజిల్ అగ్రస్థానంలో ఉండగా.. భారత్ (52%) ఆ తర్వాత స్థానంలో నిలిచింది. యూఏఈ, నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి దేశాలు కూడా తొలి పది స్థానాల్లో ఉన్నాయి. ఈ గణాంకాలు దేశీయ కంపెనీలు తమ వ్యాపారాలపై ఎంత పాజిటివ్ దృక్పథంతో ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. ఈ సానుకూల వాతావరణం భారీగా కొత్త ఉద్యోగాల (New jobs) కల్పనకు దారితీయనుంది
ప్రధాన కారణాలు ఇవే..
- ద్రవ్యోల్బణం అదుపు: దేశంలో నియామకాలకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి భారత ఆర్థిక వ్యవస్థ (Indian Economy) అంచనాలకు మించి వేగవంతమైన వృద్ధిని నమోదుచేయడమే ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయ చమురు ధరలు తక్కువగా ఉండటం వంటి అంశాలు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతున్నాయి. ఈ స్థిరత్వం వ్యాపార కార్యకలాపాల విస్తరణకు దోహదపడుతుంది.
- టెక్నాలజీ వినియోగం: కార్యకలాపాల విస్తరణతో పాటు.. కంపెనీలు ఆధునాతన సాంకేతికతలను (Advanced Technology) అందిపుచ్చుకోవడం కూడా కొత్త ఉద్యోగాల (New jobs) సృష్టికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.
పెద్ద కంపెనీల నియామకాల సంఖ్య గత ఏడాదిలో తగ్గినా.. దీనిని కేవలం వ్యూహాత్మక కారణాల రీత్యా తీసుకున్న నిర్ణయంగా మ్యాన్‌పవర్ గ్రూప్ MD సందీప్ గులేటి వివరించారు.
ఈ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు
రాబోయే త్రైమాసికంలో ఏయే రంగాల్లో నియామకాలు అధికంగా ఉండవచ్చో మ్యాన్‌పవర్ గ్రూప్ స్పష్టంగా అంచనా వేసింది.
- ఆర్థిక & బీమా రంగంలో నికర నియామక నిష్పత్తి (NEO).. 61%గా ఉంది. వ్యాపార విస్తరణ, డిజిటల్ సేవలు ఈ నియామకాలకు ప్రధాన కారణాలు.
- ఆ తర్వాతి స్థానంలో ప్రొఫెషనల్, సైంటిఫిక్ & సాంకేతిక సేవలు (IT & Professional Services) రంగం 57% NEOతో ఉంది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, టెక్నాలజీ అడాప్షన్ కారణంగా ఈ రంగంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి.
- నిర్మాణం & స్థిరాస్తి (Construction & Real Estate) రంగం 54% NEOతో మూడవ స్థానంలో ఉంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెరుగుతున్న డిమాండ్ ఈ నియామకాల పెరుగుదలకు కారణం.
కొన్ని రంగాల్లో ఆటోమేషన్ వల్ల కొత్త ఉద్యోగ నియామకాలు తగ్గుతున్నప్పటికీ.. ఈ మూడు రంగాల్లో మాత్రం కొత్త ఉద్యోగావకాశాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక, సాంకేతిక రంగాలలో నైపుణ్యం ఉన్నవారికి రాబోయే రోజుల్లో సువర్ణావకాశాలు దక్కనున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications