భారత ప్రభుత్వం ప్రపంచ స్థాయి బ్యాంకులను నిర్మించడానికి రెడీ అవుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.ముంబైలో నవంబర్ 6న జరిగిన 12వ ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాన్‌క్లేవ్‌లో నిర్మల మాట్లాడుతూ.. ప్రభుత్వం రుణదాతలతో కూర్చుని చర్చలు జరుపుతుంది. వారు పెద్ద బ్యాంకులుగా ఎలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో తెలుసుకుంటున్నాము. ఈ అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తో కూడా చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
నేను అవును అని చెప్పే ముందు చాలా పని చేయాల్సి ఉంది. కానీ ఆ దిశలో పని ఇప్పటికే ప్రారంభమైందని చెప్పగలన అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల మధ్య వెలువడటం విశేషం. ఇటీవలి వారాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల రెండవ దశ విలీనాలు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్ 15న మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, చిన్న, మధ్యస్థాయి ప్రభుత్వ బ్యాంకులను పెద్ద బ్యాంకులతో విలీనం చేసే ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తోంది.

దీని ప్రధాన ఉద్దేశ్యం బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలపరచడం, పరిమిత సంఖ్యలో అయినా స్థిరమైన, ప్రపంచ స్థాయి సంస్థలను నిర్మించడం. ఈ ప్రతిపాదనల ప్రకారం..ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BOM) వంటి చిన్న, మధ్యస్థాయి బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటి పెద్ద బ్యాంకులతో విలీనం చేయవచ్చని సమాచారం.
ఇది బ్యాంకింగ్ రంగంలో సమర్థతను పెంచడం, మూలధన బలం పెంపొందించడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల బ్యాంకులను నిర్మించడం వంటి లక్ష్యాలతో సరిపోతుంది. పెద్ద బ్యాంకులు ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, విదేశీ కార్యకలాపాలను విస్తరించడంలో భారత బ్యాంకింగ్ రంగం మరింత బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అధికారికంగా ఈ విలీనం ప్రణాళికపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.
అక్టోబర్ 24న మనీకంట్రోల్ మరోసారి నివేదించినట్లు.. చాలా ప్రభుత్వ బ్యాంకులు ప్రస్తుతం కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (MPS) నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ వాటాను తగ్గించడంపై దృష్టి పెడుతున్నాయి. 2019లో జరిగిన మొదటి దశ ఏకీకరణలో 10 ప్రభుత్వ బ్యాంకులు విలీనం కావడం ద్వారా 4 పెద్ద బ్యాంకులు ఏర్పడ్డాయి. రెండవ దశలో జరిగే విలీనాలు భారత బ్యాంకింగ్ వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించడానికి దోహదపడతాయని నిపుణులు భావిస్తున్నారు.
క్తుప్తంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అడుగులు భారత బ్యాంకింగ్ రంగాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలకు తీసుకెళ్లడం, పెద్ద మూలధన సామర్థ్యం గల సంస్థలను రూపొందించడం, క్రెడిట్ విస్తరణకు బలమైన వేదికను సిద్ధం చేయడం వంటి వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications