Economy: రాకెట్ స్పీడ్‌తో లక్ష్యం వైపు దూసుకెళ్తున్న ఇండియా.. 2047 కాదు 2027 నాటికే..
GDP: అంతర్జాతీయ విపణిలో అభివృద్ధి దిశగా భారత్ రాకెట్ వేగంతో పరిగెడుతోంది. 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియాని నిలబెట్టాలని ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ సంస్థల అంచనాలు కూడా పాజిటివ్ గా ఉండటం పాలకులలో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.
'అమృత కాల్' ప్రారంభంలోనే దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ మేరకు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు. బలమైన రూపాయి విలువ, స్థూల ఆర్థిక స్థిరత్వం దేశాన్ని ఆ స్థాయిలో నిలబెట్టాయని స్పష్టం చేశారు.

2027-28 నాటికి భారత్ తన లక్ష్యాన్ని అందుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) అంచనా వేసింది. దీన్ని ఎత్తిచూపుతూ.. దేశ GDP పరిమాణాన్ని నిర్ణయించడంలో మారకపు రేటు, మార్కెట్ బేస్డ్ సూచికలు ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయన్నారు. 1980-81లో 189 బిలియన్ డాలర్లుగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి.. 2022-23 నాటికి 3.7 ట్రిలియన్ డాలర్లకు చేరడంతో గణనీయమైన వృద్ధిని సాధించినట్లు చెప్పారు.
GDP వృద్ధి ప్రయాణంలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతునట్లు వెల్లడించారు. ఆయా సెక్టార్స్ వరుసగా 18.4 శాతం, 28.3 శాతం, 53.3 శాతం మేరకు కంట్రిబ్యూట్ చేసినట్లు స్పష్టం చేశారు. దివాలా కోడ్, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్, GST, కార్పొరేట్ పన్నుల తగ్గింపు, PLI పథకం, FDIల సరళీకరణ, డిజిటల్ పేమెంట్స్ మౌలిక సౌకర్యాల కల్పన వంటి ప్రభుత్వ చర్యలు.. GDP వృద్ధికి ఎంతగానో దోహదం చేశాయన్నారు.


Click it and Unblock the Notifications