భారతదేశంలో ఇంధన రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో 'E20 పెట్రోల్ (E20 Petrol) ను విధిగా విక్రయించాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు విదేశీ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఈ మార్పు వల్ల వాహనదారులు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.

అసలు E20 పెట్రోల్ అంటే ఏమిటి?
E20 అంటే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం. ఈ ఇథనాల్ ను సాధారణంగా చెరకు, మొక్కజొన్న, ఇతర ధాన్యాల నుండి తయారు చేస్తారు. దీనిని బయో-ఫ్యూయల్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం మార్కెట్ లో కొంతవరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఉన్నప్పటికీ.. ఏప్రిల్ నుండి 20 శాతం మిశ్రమం తప్పనిసరి కానుంది. దీనివల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి కాలుష్యం నియంత్రణలోకి వస్తుంది.
95 RON స్టాండర్డ్: ఇంజిన్ రక్షణ కోసం కొత్త జాగ్రత్త
కేంద్ర ప్రభుత్వం కేవలం ఇథనాల్‌ను కలపడమే కాకుండా పెట్రోల్ నాణ్యత విషయంలో కూడా కొత్త నిబంధనలు పెట్టింది. కొత్తగా వచ్చే పెట్రోల్ కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ (RON) కలిగి ఉండాలి. ఈ ఆక్టేన్ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే.. ఇంజిన్‌లో 'నాకింగ్' (Knocking) సమస్య అంత తక్కువగా ఉంటుంది. అంటే ఇంధనం ఇంజిన్ లోపల సక్రమంగా మండి, శబ్దం రాకుండా చూస్తుంది. దీనివల్ల ఆధునిక ఇంజిన్లు సురక్షితంగా ఉంటాయి.
మీ వాహనంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ కొత్త రూల్స్ వల్ల వాహనదారుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ముఖ్యంగా పాత వాహనాల పరిస్థితి ఏమిటనేది పెద్ద ప్రశ్న.
- కొత్త వాహనాలు: 2023 నుండి 2025 మధ్య తయారైన వాహనాలు దాదాపు అన్నీ E20 Petrol కి అనుగుణంగానే డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి వీటిలో ఎటువంటి సమస్య ఉండదు.
- పాత వాహనాలు: పదేళ్ల క్రితం నాటి పాత వాహనాల్లో ఇథనాల్ ప్రభావం వల్ల ఇంజిన్‌లోని రబ్బరు లేదా ప్లాస్టిక్ భాగాలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా పాత బండ్ల మైలేజీ సుమారు 3% నుండి 7% వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
భారతదేశం తన అవసరాలకు కావాల్సిన చమురులో సింహభాగం విదేశాల నుండే దిగుమతి చేసుకుంటోంది. ఇథనాల్ వాడకం పెరగడం వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అలాగే దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తి చేసే రైతులకు కూడా మంచి ఆదాయం లభిస్తుంది. పర్యావరణానికి మేలు చేయడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పాలసీ యొక్క ముఖ్య లక్ష్యం.
మొత్తంగా ఏప్రిల్ 1 నుండి బంకుల్లో పెట్రోల్ కొట్టించేటప్పుడు మీ వాహన మాన్యువల్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. మీ వాహనం E20 కి సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇంజిన్ రిపేర్ల ఖర్చును తప్పించుకోవచ్చు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications