IT News: ఆ రంగంలో పెరుగుతూ పోతున్న భారత్ స్పెండింగ్.. నేలచూపులు చూస్తున్న అగ్రదేశాలు
IT Expenditure: అంతర్జాతీయంగా ఏర్పడిన మందగమన పరిస్థితుల వల్ల పలు దేశాలు తమ ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు IT రంగంపై ఎక్కువగా వెచ్చించిన పశ్చిమ దేశాలు కూడా ఆల్టర్నేటివ్ కోసం పాకులాడుతున్నాయి. అయితే అందుకు భిన్నంగా భారత్ మాత్రం తన స్పెండింగ్‌ను పెంచుతూ పోవడం ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది.
గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రొవైడర్ అయిన ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్(IDC).. భారత IT స్పెండింగ్‌పై కీలక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2024లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై భారత్ వెచ్చించే మొత్తం 11 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. తద్వారా దాని విలువ 44 బిలియన్ డాలర్లకు చేరుతుందని లెక్క కట్టింది.

'ది ఫ్యూచర్ ఆఫ్ ఐటీ: రీ థింకింగ్ డిజిటలైజేషన్ ఫర్ యాన్ ఏఐ ఎవ్రీవేర్ వరల్డ్' అనే అంశంపై సమ్మిట్ జరిగింది. ఈ 13వ ఎడిషన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్(CIO) మరియు సీనియర్ IT నిపుణులు పాల్గొన్నారు. 2023 ఏడాది మొత్తం ఆర్థిక ప్రతికూలతలు, అనిశ్చితి ఉన్నప్పటికీ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచేందుకు ఇండియా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు.
ఈ ఏడాది కూడా ఇదే జోష్ కొనసాగనుందని IDC పేర్కొంది. 2027లో 59 బిలియన్ డాలర్లు మార్కును దాటేందుకు ఇండియన్ IT మార్కెట్ పరుగులు పెడుతోందని వెల్లడించింది. ఇందులో భాగంగా రాబోయే నాలుగేళ్లలో 9.9 శాతం CAGRతో భారత్ IT రంగం మంచి వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. జనరేటివ్ AI విభాగంలో భారీ ఆవిష్కరణలు రాబోతున్నాయని, ఇందులో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతూ పోతుందని అభిప్రాయబడింది.


Click it and Unblock the Notifications