భారత్‌ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. ఇక గల్ఫ్ దేశాల ఆటలు సాగవు, ఆయిల్ మార్కెట్ మన చేతుల్లోకి!

భారతదేశం అనగానే మనకు గుర్తొచ్చేది.. ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశాల నుండి ఆయిల్ దిగుమతి చేసుకోవడం. గల్ఫ్ దేశాల్లో చిన్న గొడవ జరిగినా, యుద్ధ వాతావరణం వచ్చినా మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కడ పెరిగిపోతాయో అని భయపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇకపై ఆ సీన్ మారబోతోంది! అవును, India is set to rewrite its oil destiny, moving from risk to leverage. మన దేశం కేవలం ఒక కొనుగోలుదారుడిలా కాకుండా, గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను శాసించే స్థాయికి ఎదుగుతోంది. యూఏఈ (UAE) తో కుదుర్చుకున్న ఒక భారీ ఒప్పందం దీనికి కారణం.

India is set to rewrite its oil destiny moving from risk to leverage UAE strategic reserve

అసలు ఏంటి ఈ మెగా ప్లాన్?

యూఏఈకి చెందిన 'అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ' (ADNOC) మన దేశంలో తన చమురు నిల్వలను ఏకంగా 30 మిలియన్ బారెల్స్‌కు పెంచబోతోంది. ప్రస్తుతం మన దేశంలో విశాఖపట్నం, మంగళూరు, పడూరు లలో ఉన్న అండర్ గ్రౌండ్ స్టోరేజ్ కెపాసిటీ చాలా తక్కువ. కానీ తాజా డీల్‌తో ఇది దాదాపు ఐదింతలు పెరుగుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే.. అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడమే కాకుండా, ఈ ఆయిల్‌ను మనం వేరే దేశాలకు అమ్ముకునే (కమర్షియల్) సదుపాయం కూడా లభిస్తుంది.

పెరగనున్న భారత్ బలం (Geopolitical Power)

ఈ ఒప్పందం కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ఒక పెద్ద మైండ్ గేమ్. మన దేశంలో భారీగా ఆయిల్ నిల్వలు ఉండటం వల్ల, అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లను మనం కూడా ప్రభావితం చేయవచ్చు. రేపు పొద్దున మిడిల్ ఈస్ట్‌లో ఏదైనా యుద్ధం వచ్చి సప్లై ఆగిపోయినా, మన దగ్గర ఉన్న స్టాక్‌తో దేశాన్ని కాపాడుకోవచ్చు. అంతేకాదు, ఇతర ఆయిల్ ఎగుమతి చేసే దేశాలు మనకు తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ ఇచ్చేలా బేరసారాలు ఆడే (Bargaining Power) సత్తా భారత్‌కు వస్తుంది.

'ఫుజైరా' అడ్వాంటేజ్ , గ్యాస్ సెక్యూరిటీ

ఈ వ్యూహంలో మరో అద్భుతమైన విషయం ఉంది. యూఏఈ లోని 'ఫుజైరా' ఆయిల్ హబ్‌లో కూడా భారత్ తన నిల్వలను ఉంచుకునే అవకాశం రాబోతోంది. ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) వెలుపల ఉండటం వల్ల, అక్కడ ఎలాంటి ఉద్రిక్తతలు ఉన్నా మన ఆయిల్ సప్లైకి ఢోకా ఉండదు.

కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. వంటగ్యాస్ (LPG), సహజ వాయువు (LNG) నిల్వలను కూడా భారీగా పెంచేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇప్పటికే యూఏఈ తో 14 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందం చేసుకుంది. దీనివల్ల దేశంలోని కోట్ల కుటుంబాలకు వంటగ్యాస్ కొరత లేకుండా చూసుకోవచ్చు.

ఇప్పటివరకు ఆయిల్ విషయంలో భారత్ ఎప్పుడూ డిఫెన్స్‌లోనే ఉంది. ధరలు పెరిగితే తల ఊపడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఈ సరికొత్త వ్యూహాత్మక అడుగుతో భారత్ ప్యాసివ్ ప్లేయర్ నుండి యాక్టివ్ ప్లేయర్‌గా మారుతోంది. రిస్క్ నుంచి పవర్ లోకి రావడం అంటే ఇదే! ఈ కొత్త ఎనర్జీ పార్ట్‌నర్‌షిప్‌తో భారత్ తన చమురు భవితవ్యాన్ని తానే రాసుకోబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+