Edible Oil: భారీ స్థాయిలో వంట నూనెల దిగుమతి.. ధరలు పెరుగుతాయా..!

భారతదేశంలో క్రూడ్ ఆయిల్ తో పాటు వంట నూనెలు కూడా భారీగానే దిగుమతి చేసుకుంటుంది. క్రూడ్ ఆయిల్ ఇండియాలో దొరకడం కష్టం కాబట్టి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కానీ.. వంట నూనెలు మన దేశంలోనే పండించుకోవచ్చు. కానీ.. దేశ అవసరాలకు సరిపడ నూనె గింజలను పండించడం లేదు. భారత్ ఎక్కువగా పామాయిల్ దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇక్కడే పామాయిల్ పండిస్తే.. బాగుంటుందని చెబుతున్నప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా భారత్ భారీ స్థాయిలో వంట నూనెల దిగుమతి ప్లాన్ చేస్తోంది.

రాబోయే పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని వంట నూనెల కొరత లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం, దేశీయ రిఫైనరీలు చర్యలు తీసుకుంటున్నాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు నెలకు 15 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి చేసుకోవడానికి ప్లాన్ చేశాయి. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి పండుగలకు పిండి వంటలు, స్వీట్లు ఎక్కువ చేస్తారు. వీటికి భారీ స్థాయిలో నూనె అవసరం పడుతుంది. అందుకే వంట నూనెల కొరత లేకుండా ఉండేందుకు భారీ ఎత్తున వంట నూనెలు దిగుమతి చేసుకోనున్నారు.

Edible Oil

ప్రస్తుతం దేశంలో సోయాబీన్, ఆవాల క్రషింగ్ తగ్గడంతో నూనెల లభ్యత తగ్గింది. ఈ లోటును భర్తీ చేయడానికి పండుగల నాటి గరిష్ఠ డిమాండ్‌ను తట్టుకోవడానికి దిగుమతులే ఏకైక మార్గంగా మారాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి.మెహతా చెప్పారు. దేశీయ రిఫైనర్లు పామ్ ఆయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు పెంచుకుంటున్నాయి. ఇండియా ప్రధానంగా ఇండోనేషియా, మలేషియాల నుంచి భారీ ముడి పామాయిల్ నూనెను దిగుమతి చేసుకుంటుంది.

అర్జెంటీనా, బ్రెజిల్‌ల నుంచి సోయా నూనె, రష్యా-ఉక్రెయిన్‌ల నుంచి పొద్దుతిరుగుడు నూనె దిగుమతులు చేసుకుంటుంది. భారత్ నుంచి పెద్దమొత్తంలో ఆర్డర్లు రావడంతో ఇండోనేషియా, మలేషియాల్లో నిల్వలు తగ్గి మలేషియన్ పామ్ ఆయిల్, గ్లోబల్ సోయా ఆయిల్ ఫ్యూచర్స్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్నాయి. ఇండియా మొత్తం వంటనూనెల అవసరాలలో దాదాపు 55-60 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతుంది. అయితే గత కొద్ది రోజులుగా వంట నూనెల ధరలు క్రమంగా పెరుగుతోన్నాయి. రూ.110 ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ ధర ప్రస్తుతం రూ.160 చేరింది. భవిష్యత్ లో దిగుమతులను తగ్గించుకోవడానికి నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ లో భాగంగా నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+