Silver News: దేశీయంగా నిన్న పసిడి ధరలు స్వల్పంగా తగ్గగా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ.6,620గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,222 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో వెండి కేజీ ధర నిన్నటి కంటే రూ.500 తగ్గి తెలుగు రాష్ట్రాల్లో నేడు రూ.95,600గా కొనసాగుతోంది.
ఈ ఏడాది వెండి ధరలు అనూహ్యంగా పెరగటం భారతీయ వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత నెలలో తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కేటీ గరిష్ఠంగా రూ.లక్ష మార్కును దాటేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెరుగుదలకు అసలు కారణాల కోసం చాలా మంది వెతుకుతున్నారు. తదనుగుణంగా తమ పెట్టుబడి, కొనుగోలు నిర్ణయాలను చేయాలని వారు చూస్తున్నారు.

వాస్తవానికి ఈ ఏడాది భారత్ యూఏఈ నుంచి అసాధారణ స్థాయిల్లో వెండిని దిగుమతి చేసుకుంటోంది. అవును గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు దాదాపు 60 రెట్లు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే యూఏఈ వెండిని ఉత్పత్తి చేయదు. మాజీ ట్రేడ్ ఆఫీసర్ అజయ్ శ్రీవాస్తవ నేతృత్వంలోని థింక్ ట్యాంక్ ప్రకారం.. యూఏఈ నుంచి వెండి దిగుమతులు 5.853 శాతం పెరిగాయని, ఎఫ్‌వై 23లో 29.2 మిలియన్ డాలర్ల నుంచి ఇది ఎఫ్‌వై 24లో 1.74 బిలియన్ డాలర్లకు పెరిగిందని వెల్లడైంది. యూఏఈ నుంచి అధికంగా దిగుమతి చేసుకోవటానికి కారణం ఇక్కడ దిగుమతి సుంఖం కేవలం 8 శాతం, ఇతరదేశాల నుంచి ఇది 15 శాతంగా ఉంది.
అయితే ఈ వాణిజ్యం అసాధారణమైనది ఎందుకంటే UAE వెండిని ఉత్పత్తి చేయదు. ఇది పెద్ద వెండి కడ్డీలను దిగుమతి చేసుకుని వాటిని కరిగించి వెండి గింజలుగా మారుస్తుంది. గ్లోబల్ రిఫైనర్‌లతో తనిఖీ చేస్తే, అటువంటి ప్రక్రియలో విలువ జోడింపు FTA కింద 3 శాతం కాకుండా 1 శాతం కంటే చాలా తక్కువగా ఉందని చూపుతుంది. అయితే ఈ క్రమంలో ఇండియా 2023లో దిగుమతి చేసుకున్న వెండి కంటే ఎక్కువ ఈ ఏడాది మెుదటి నాలుగు నెలల్లోనే అంటే మార్చి నాటికి అధికంగా ఖరీదైన లోహాన్ని దిగుమతి చేసుకున్నట్లు వెల్లడైంది. భారతదేశం జనవరి నుండి ఏప్రిల్ వరకు 4,172 మెట్రిక్ టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. ఇది ఒక సంవత్సరం క్రితం ఇదే కాలంలో 455 టన్నులుగా ఉంది.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ హయాంలో ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ రంగంపై భారీగా దృష్టి సారించింది. దీంతో అధికంగా సోలార్ ఎనర్జీ రంగంలో ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండియా దిగుమతి చేసుకుంటున్న వెండిలో అధికభాగం సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తికి వెళుతోందని, అందువల్ల భవిష్యత్తులో సైతం వెండి ధరలు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నట్లు మార్కెట్లోని నిపుణులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా ఆభరణాలు, వస్తువులను కొనాలనుకునే వారు తమ కొనుగోళ్లను ప్లాన్ చేసుకోవటం ఉత్తమం.


Click it and Unblock the Notifications