భారతదేశంలో ధరల పెరుగుదల లేదా ద్రవ్యోల్బణం (Inflation) లెక్కించే పద్ధతిలో ప్రభుత్వం ఒక కీలకమైన మార్పు చేసింది. గత పదేళ్లకు పైగా మనం వాడుతున్న పాత పద్ధతికి స్వస్తి పలికి, నేటి కాలానికి తగ్గట్టుగా కొత్త ఫార్ములాను ప్రవేశపెట్టింది. ఇది కేవలం గణాంకాల మార్పు మాత్రమే కాదు.. ఇది మీ బ్యాంక్ లోన్ ఈఎంఐలు (EMIs), సేవింగ్స్ , మీ నెలవారీ ఖర్చులపై నేరుగా ప్రభావం చూపుతుంది.

బేస్ ఇయర్ మార్పు: 2012 నుంచి 2024కి!
ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి ఒక 'బేస్ ఇయర్' (ఆధారిత సంవత్సరం) ఉంటుంది. ఇప్పటి వరకు మనం 2012 ధరలను ప్రామాణికంగా తీసుకునేవాళ్ళం. కానీ 2012 నాటి భారత్ వేరు, ఇప్పటి భారత్ వేరు. అప్పట్లో ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు, యాప్ ఆధారిత సేవలు చాలా తక్కువ. మన ఖర్చు చేసే విధానం 12 ఏళ్లలో పూర్తిగా మారిపోయింది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు 2024 ను బేస్ ఇయర్‌గా ప్రకటించింది. అంటే, ఇకపై ప్రస్తుత ధరలను 2024 ధరలతో పోల్చి ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు.
ఆహార పదార్థాల ప్రాధాన్యత తగ్గింది
పాత పద్ధతిలో ద్రవ్యోల్బణం లెక్కల్లో ఆహార పదార్థాల వాటా (Weightage) దాదాపు 46% ఉండేది. అంటే టమోటాలు, ఉల్లిపాయల ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం అంకెలు అమాంతం పెరిగిపోయేవి. కానీ కొత్త సిరీస్ లో ఆహార పదార్థాల వాటాను 37% కి తగ్గించారు. దీనివల్ల కూరగాయల ధరల్లో వచ్చే అకస్మాత్తు మార్పులు మొత్తం దేశ ఆర్థిక గణాంకాలను మునుపటిలా ప్రభావితం చేయవు.
ఇకపై ఇంటి అద్దెలు కూడా కీలకం
మనం తినే ఆహారం కంటే మనం ఎక్కడ ఉంటున్నాం, ఎలాంటి సేవలను పొందుతున్నాం అనేదానికి కొత్త పద్ధతిలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
- హౌసింగ్ (Housing): పట్టణ ప్రాంతాల్లో పెరిగే ఇంటి అద్దెలు ఇకపై ద్రవ్యోల్బణంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.
- సేవలు (Services): వైద్య ఖర్చులు, స్కూల్ ఫీజులు, రవాణా ఛార్జీలు వంటి సేవలకు వెయిటేజీ పెంచారు. మీరు మెట్రో సిటీల్లో ఉంటూ ఎక్కువ అద్దె కడుతుంటే, ప్రభుత్వం చెప్పే ద్రవ్యోల్బణం నంబర్ ఇప్పుడు మీ అసలు ఖర్చులకు దగ్గరగా అనిపిస్తుంది. మునుపటిలా కేవలం ప్లేటులో ఉన్న ఆహారం మాత్రమే కాకుండా మీరు నివసించే ఇల్లు కూడా ఇన్ఫ్లేషన్‌ను నిర్ణయిస్తుంది.
కొత్త ఐటమ్స్ చేరిక
గతంలో 299 వస్తువుల ధరలను మాత్రమే ట్రాక్ చేసేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 358 కి పెంచారు. ఆధునిక కాలంలో మనం ఎక్కువగా వాడుతున్న ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ సేవలను కూడా ఈ జాబితాలో చేర్చారు. దీనివల్ల దేశంలో ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అనే విషయంలో మరింత ఖచ్చితత్వం వస్తుంది.
దీనివల్ల మీకు కలిగే లాభం ఏమిటి?
ద్రవ్యోల్బణం (Inflation) గణాంకాల ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుంది. కొత్త పద్ధతిలో ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైతే బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీ హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ ఈఎంఐలు తగ్గుతాయి. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే.. వడ్డీ రేట్ల తగ్గింపు మరికొంత కాలం ఆలస్యం కావచ్చు.
మొత్తానికి ప్రభుత్వం చేసిన ఈ మార్పు సామాన్యుడి జీవనశైలికి అద్దం పట్టేలా ఉంది. మనం తినే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, మన పిల్లల చదువులకు, ఆరోగ్యానికి, నివాసానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ కొత్త లెక్కలు చెబుతున్నాయి. ఇకపై ద్రవ్యోల్బణం పెరిగిందని వార్త వస్తే.. అది కేవలం ఉల్లిపాయల ధర వల్ల కాదు. మీ ఇంటి అద్దె లేదా ఇతర సేవల ధరల వల్ల కూడా కావచ్చని గుర్తుంచుకోండి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications