గాడిలో పెట్టండి: బడ్జెట్‌పై పారిశ్రామికవేత్తలు, నిర్మలతో భేటీకి టాటా చంద్రశేఖరన్ డుమ్మా

ఎప్పటిలాగే మరో ఏడాది గడిచిపోతోంది. ఎన్నో ఆశలు, ఎంతో నమ్మకంతో ప్రజలు 2019 ని ఆహ్వానించారు. దేశంలో మెజారిటీ ప్రజలు కోరుకున్న బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. చాలా రాష్ట్రాల్లోనూ ప్రజలు కొత్త తీర్పులిచ్చారు. ఇటు అటు దేశానికి, ఇటు రాష్ట్రాలకు తిరుగులేదు అని భావించారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి. దేశ ఆర్థిక ప్రగతి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రభుత్వం గతంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల ప్రభావం ఇప్పుడు దేశమంతా కనిపిస్తోంది. జీఎస్టీ అమలు వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులు పన్నులు సకాలంలో చెల్లించలేకపోతున్నారు. మరో వైపు ఆర్థిక మందగమనం దేశాన్ని పట్టి పీడిస్తోంది.

ఆటోమొబైల్ రంగంతో మొదలైన మందగమనం మెల్లగా అన్ని రంగాలను చుట్టేసింది. తాజా గణాంకాల ప్రకారం దేశ జీడీపీ ఆరేళ్ళ కనిష్ట స్థాయి 4.5% కి పడిపోయింది. మందగమన ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేవీ పెద్దగా ఫలితాలు ఇచ్చినట్లు కనిపించటంలేదు. కార్పొరేట్ టాక్స్ ను 22% ని తగ్గించినా... కొత్త తయారీ కంపెనీలకు 15% పన్ను అని ఎంత చెప్పినా... పెట్టుబడులు రాలేదు. ఉద్యోగాల కల్పన జరగలేదు. అందుకే, ఇప్పటికైనా కొత్త బడ్జెట్ లో మెరుగైన నిర్ణయాలతో దేశాన్నిముందుకు నడిపించాలని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఆర్థిక మంత్రిని కలిసిన పారిశ్రామికవేత్తలు...

ఆర్థిక మంత్రిని కలిసిన పారిశ్రామికవేత్తలు...

బడ్జెట్ కు ముందస్తు సన్నాహాల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీ అసోసియేషన్ల తో సమావేశమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం జరిగిన ఈ సమావేశానికి ఎయిర్టెల్ అధినేత సునీల భారతి మిట్టల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్, ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమని, కే రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ రవి రహేజా, జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ బీవీఎన్ రావు, అశోక్ లేలాండ్ ఎండీ విపిన్ సొంది, ఆర్ఫీ సంజీవ్ గోయెంకా గ్రూప్ అధినేత సందీప్ గోయెంకా, విప్రో గ్లోబల్ సిఎఫ్ఓ జతిన్ దళాలపతంజలి ఆయుర్వేద చైర్మన్ ఆచార్య బాలకృష్ణ, అసోచామ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ గోయెంకా తదితరులు హాజరయ్యారని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.

స్వేచ్ఛ కావాలి...

స్వేచ్ఛ కావాలి...

ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తమ పని తాము చేసుకొనేందుకు అవసరమైన స్వేచ్ఛను కల్పించాలని, ఈ బడ్జెట్ అలంటి నిర్ణయాలతో పారిశ్రామికవేత్తల సత్తాను చాటుకునే నిర్ణయాలు ఉండాలని ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ విలేకర్లతో చెప్పారు. అదే సమయంలో కొనుగోళ్లు, విలీనాలు విషయంలో ఎన్సిఎల్టి, కొన్ని ఇన్కమ్ టాక్స్ నిబంధనలు ఇబ్బందికి గురిచేస్తున్నాయని, వాటిని సవరించాలని సలహా ఇచ్చినట్లు అయన తెలిపారు. అదే సమయంలో దేశంలో పెట్టుబడులు సురక్షితం అనే భావనను కల్పించాలని సీఐఐ కోరింది. తగ్గించిన కార్పొరేట్ టాక్స్ 22% పన్ను రేటును ప్రస్తుతమున్న లిమిటెడ్ లయబిలిటీ పార్టీనేర్షిప్ (ఎల్ ఎల్ పీ ), పార్ట్నెర్షిప్ ఫర్మ్ లకు కూడా విస్తరించాలని కోరింది. తద్వారా చిన్న సంస్థలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది.

వినియోగం పెంచాలి...

వినియోగం పెంచాలి...

దేశంలో మందగమనంలో నడుస్తున్న వినియోగం పెంచేందుకు తగిన చర్యలు ఉండాలని పారిశ్రామికవేత్తలు కోరారు. అందుకోసం రూ 20 లక్షలు అంతకంటే అధికంగా ఉన్న ఆదాయంపై పన్ను రేటును తగ్గించాలని, తద్వారా దేశంలో వినియోగం పెరుగుతుందని సూచించారు. అదే సమయంలో ఇండ్లు కొనుగోలు చేసినప్పుడు ఫామిలీ టాక్స్ డిడిక్షన్ కు అనుమతించాలని కూడా కోరారు. దిగుమతులు తగ్గించేలా సుంకాలు ఉండాలని, ఎగుమతులు పెంచేలా పన్ను రేట్లను ప్రక్షాళించాలని చెప్పారు. లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించాలని విన్నపించారు. దేశంలో తయారీ ని ప్రోత్సహించి మాక్ ఇన్ ఇండియా ని బలోపేతం చేయాలని కోరారు.

గైర్హాజరు అయిన చంద్రశేఖరన్...

గైర్హాజరు అయిన చంద్రశేఖరన్...

దేశంలో అతిపెద్ద పారిశ్రామిక గ్రూపుల్లో ఒకటైన టాటా గ్రూప్ నుంచి ఈ సారి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ యెన్ చంద్రశేఖరన్ ఆర్థిక మంత్రితో ఏర్పాటు చేసిన ప్రీ బడ్జెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. సైరస్ మిస్త్రీ తో నెలకొన్న కోర్టు వివాదం నేపథ్యంలో అయన ఈ సమావేశానికి రాలేదని తెలిసింది. ఇదిలా ఉండగా .. పారిశ్రామికవేత్తలు 15% పన్ను రేటును అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నియంత్రణ విధానాలు, జీడీపీ వృద్ధి కి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+