Unicorns: యూనికార్న్స్‌పై హురున్ తాజా రిపోర్ట్.. భారత్‌కు ఒక గుడ్, మరో బ్యాడ్ న్యూస్
Hurun Unicorns Report: గత కొంతకాలంగా దేశంలో స్టార్టప్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. అందులోనూ 1 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ కలిగిన యూనికార్న్స్ చాలా నెలకొల్పబడ్డాయి. తాజాగా రిలీజ్ అయిన నివేదిక ప్రకారం ఈ విషయంలో ప్రపంచంలో మేటి దేశంగా భారత్ నిలిచినట్లు కనిపిస్తోంది. అయితే కొంత డ్యామేజ్ అయిన మాట కూడా అంగీకరించి తీరాల్సిందే.
దేశంలో 1 బిలియన్ డాలర్లకు పైగా విలువైన యునికార్న్‌ల సంఖ్య నాలుగేళ్లలో మొదటిసారిగా 67కి తగ్గిందని హురున్ గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ 2024 నివేదిక తెలిపింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా యునికార్న్‌లకు భారత్ మూడవ అతిపెద్ద కేంద్రంగా ఉన్నట్లు పేర్కొంది. గతంలో 22 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ ఈ జాబితా నుంచి తొలగించబడినట్లు వెల్లడించింది.

నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని ఏ స్టార్టప్ కూడా బైజూస్ అంత రేంజ్‌లో వాల్యుయేషన్ తగ్గుదల నమోదు చేయలేదు. తన కార్యకలాపాలను పునర్నిర్మించడం సహా పెరుగుతున్న నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఖర్చులను తగ్గించుకోవడంతో దాని గౌరవనీయమైన స్థానాన్ని కోల్పోయింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1.2 బిలియన్ డాలర్ల మేర రుణ భారాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తోంది.
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ మరియు ఫాంటసీ స్పోర్ట్స్-ఫోకస్డ్ డ్రీమ్11 భారతదేశంలోని అత్యంత విలువైన యునికార్న్‌లుగా కొనసాగుతున్నాయి. ఒక్కొక్కటి దాదాపు 8 బిలియన్ డాలర్లు వాల్యుయేషన్ కలిగి ఉన్నాయి. ఇక రేజర్‌పే 7.5 బిలియన్ డాలర్లతో వాటి వెన్నంటే ఉంది. రెండు అత్యంత విలువైన భారతీయ యునికార్న్‌లు ప్రపంచవ్యాప్తంగా 83వ స్థానంలో ఉండగా.. రేజర్‌పే 94వ స్థానంలో నిలిచింది.
ఇతర దేశాల్లో కంపెనీని ప్రారంభించాలనే ధోరణి భారతదేశానికి ఉన్న అవకాశాలను కూడా దెబ్బతీసిందని హురున్ రిపోర్ట్ ఛైర్మన్ మరియు ప్రధాన పరిశోధకుడు రూపెర్ట్ హూగ్‌వెర్ఫ్ అభిప్రాయపడ్డారు. ఇండియాకు చెందిన వ్యవస్థాపకులు దేశం వెలుపల 109, భారత్‌లో 67 యునికార్న్‌లను ప్రారంభించినట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications