UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ కొత్త సంచలనాలను సృష్టిస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో యూపీఐ చెల్లింపుల విజయాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేస్తోంది.
నిన్న భారత ప్రధాని మోదీ యూఏఈ పర్యటనలో రెండు దేశాల మధ్య యూపీఐ చెల్లింపు వ్యవస్థకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. దీనికి తోడు సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి డాలర్ కి బదులుగా తమ సొంత కరెన్సీల్లో చెల్లింపులకు రెండు దేశాలు అంగీకరించాయి.

అయితే తాజాగా ఇదే తరహా చర్చలు ఇండియా-ఇండోనేషియా మధ్య జరుగుతున్నాయని తెలుస్తోంది. రెండు దేశాలు కూడా డిజిటల్ టెక్నాలజీ, సెంట్రల్ బ్యాంకుల క్రింద చెల్లింపు వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని అన్వేషిస్తున్నాయి. 2022లో ఇండోనేషియా.. ఇండియాకు ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. పామాయిల్, పెట్రోలియం వ్యాపారం కారణంగా 19 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులుతో ఉంది. ఈ క్రమంలో రూపాయి ట్రేడ్ సెటిల్‌మెంట్‌పై భారత్ ఇండోనేషియాతో చర్చలు జరుపుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా రూపాయి గుర్తింపును మెరుగుపరచడం, US డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా US డాలర్‌కు బదులుగా భారతీయ రూపాయల్లో అంతర్జాతీయ వాణిజ్య పరిష్కారాలను సులభతరం చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చురుకుగా పని చేస్తోంది. తక్కువ ఫారెక్స్ నిల్వలు లేదా పాశ్చాత్య ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశాలకు ఇది సరైన వెసులుబాటును కల్పించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
స్థానిక కరెన్సీలలో లావాదేవీలను సెటిల్ చేయడానికి ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి భారతదేశం-యూఏఈ ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీనికి ముందు ఫ్రాన్స్‌లో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ఏర్పాటు జరిగింది. ఇది టూరిస్టులకు రూపాయిలలో చెల్లింపులకు వెసులుబాటు కల్పిస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు.


Click it and Unblock the Notifications