ఆర్థిక వ్యవస్థలు తిరిగి ప్రారంభమైనా... ప్చ్ లాభం లేదు!

కరోనా మహమ్మారి, లాక్ డౌన్ తర్వాత భారత ఆర్థికవ్యవస్థ తిరిగి ప్రారంభమైంది. కంటైన్మెంట్ జోన్ వంటి కొన్ని ప్రాంతాలు మినహా, కొన్ని ఆంక్షలతో ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకున్నాయి. వ్యాపారాలు తిరిగి తెరుచుకున్నప్పటికీ డిమాండ్ లేమి కనిపిస్తోంది. దాదాపు మే నెల నుండే కొన్ని తెరుచుకున్నప్పటికీ ఇది రికవరీ అని చెప్పలేమని అంటున్నారు. ప్రపంచంలోనే అతి కఠినమైన లాక్ డౌన్ దేశంలో విధించారు. దీంతో ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపింది. మే నెలలో కొన్ని తెర్చుకున్నప్పటికీ తిరోగమనం భారీగానే ఉంది.

రెండంకెల క్షీణత

రెండంకెల క్షీణత

మౌలిక సదుపాయాల ఉత్పత్తి నుండి ఎగుమతుల వరకు అన్నీ దాదాపు రెండెంకల క్షీణతను నమోదు చేశాయి. దీనికి తోడు వివిధ ఏజెన్సీలు భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది భారీగా ప్రతికూలతను నమోదు చేస్తాయని చెబుతున్నాయి. ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ 4.5 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. నాలుగు దశాబ్దాల్లో ఇది అతిపెద్దదిగా చెబుతున్నారు. గోల్డ్‌మెన్ సాక్స్ అయితే 5 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా వేసింది. బ్లూమ్‌బర్గ్ ఎకనామిక్స్ 10.6 శాతం పడిపోతుందని భావిస్తోంది.

వ్యాపార కార్యకలాపాలు

వ్యాపార కార్యకలాపాలు

దేశంలో ఆధిపత్య సేవలరంగంలో మే నెల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. అయితే ఇది రికవరీకి చిహ్నంగా భావించలేమని చెబుతున్నారు. ప్రధాన సేవల సూచీ 5.4 శాతం నుండి 12.6 శాతానికి పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ 30.8 శాతం వద్ద ఉంది. ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వే ప్రకారం షట్ డౌన్, డిమాండ్ లేమి కారణంగా అవుట్‌పుట్ పడిపోయింది. కొత్త ఆర్డర్స్ క్షీణత, ధరల ఒత్తిళ్లపై దీని ప్రభావం ఉంటుంది.

ఎగుమతులు

ఎగుమతులు

మే నెలలో ఎగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 36.5 శాతం పడిపోయి 19.1 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇది అంతకుముందు (ఏప్రిల్) నెల కంటే స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో స్వల్పంగా పెరిగాయి. అయితే చమురేతర జెమ్స్, జ్యువెల్లరీసు, టెక్స్‌టైల్స్ సహా వివిధ ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 30.1 శాతం పడిపోయాయి.

వినియోగం

వినియోగం

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఆదాయ క్షీణత, ఉద్యోగాల కోత, శాలరీ కోత వంటి వివిధ కారణాలతో పాటు ముందు ముందు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ఖర్చుపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. షాపర్ ట్రాక్ డేటా ప్రకారం రిటైల్ స్టోర్స్ మే నెలలో దాదాపు 30 శాతం వరకు పడిపోయాయి. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ రికార్డ్ స్థాయికి పడిపోయినట్లు సెంట్రల్ బ్యాంకు సర్వేలోను వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థ డిమాండ్‌కు మరో నిదర్శనం ఆటో సేల్స్. ఏప్రిల్ నెలలో జీరో సేల్స్ ఉండటం గమనార్హం.

మే నెలలో పెరిగినప్పటికీ అంతకుముందుతో పోలిస్తే పెద్ద ఎత్తున పడిపోయాయి. బ్యాంకు క్రెడిట్ గ్రోత్ ఏప్రిల్ నెలలో ఏడాది ప్రాతిపదికన 6.8 శాతం నుండి 5.5 శాతానికి తగ్గింది. ఔట్ స్టాండింగ్ బ్యాంక్ క్రెడిట్ 102.7 ట్రిలియన్ రూపాయల నుండి 102.2 ట్రిలియన్ రూపాయలకు పడిపోయింది. మరో విషయం ఏమంటే పరిస్థితికి అనుగుణంగా సెంట్రల్ బ్యాంకు కేంద్ర బ్యాంకు లిక్విడిటీని అందుబాటులోకి తెచ్చింది.

పారిశ్రామిక ఉత్పత్తి

పారిశ్రామిక ఉత్పత్తి

పారిశ్రామిక ఉత్పత్తి సూచీ ఏప్రిల్ నెలలో రికార్డ్ స్థాయిలో పడిపోయింది. కరోనా, లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు ఎక్కువ భాగం క్లోజ్ అయ్యాయి. చాలా వరకు ఉత్పత్తి నిలిచిపోయింది. మౌలిక సదుపాయాల పారిశ్రామిక ఉత్పత్తి ఏడాది క్రితంతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 38.1 శాతం తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 40 శాతం వరకు ఉన్న రంగాలు మార్చి నెలలో 9 శాతానికి పడిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+