Exports restrictions: భారత ప్రజలు సహా దేశ ప్రధానిపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు చైనా అనుకూల పంథాను అనుసరిస్తున్నారు. దీంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అయినప్పటికీ మాల్దీవులకు భారత్ సహాయాన్ని అందిస్తూనే ఉంది. కాగా ఇప్పుడు ఆ దేశానికి ఇండియా ఓ షాక్ ఇచ్చింది.
మాల్దీవులకు వ్యతిరేకంగా భారత్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) కొన్ని ఉత్పత్తులపై పోర్ట్ పరిమితులను విధించింది. గతంలో రవాణాకు అనుమతించబడిన, అనేక నిషేధించబడిన మరియు పరిమితం చేయబడిన అవసరమైన వస్తువుల ఎక్స్‌పోర్ట్స్‌పై ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం నిత్యావసర వస్తువుల ఎగుమతి ఇప్పుడు 4 కస్టమ్ స్టేషన్ల ద్వారా మాత్రమే జరుగుతుంది. ముంద్రా స్కా పోర్ట్, టుటికోరిన్ సీ పోర్ట్, నవా షెవా సీ పోర్ట్ (JNPT) మరియు ICD తుగ్లకాబాద్‌ల నుంచి మాత్రమే ఎక్స్‌పోర్ట్స్ అనుమతించబడతాయని DGFT తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
అయితే ఏప్రిల్ 5న మాల్దీవుల అభ్యర్థన మేరకు ప్రత్యేకమైన ద్వైపాక్షిక యంత్రాంగం ద్వారా 2024-25కి సంబంధించి ఖచ్చితమైన మొత్తంలో ప్రాథమిక ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతదేశం అంగీకరించింది. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, గుడ్లు, బియ్యం, గోధుమ పిండి, చక్కెర్ వంటి 9 వస్తువులపై ఎగుమతి పరిమితులను తొలగించింది. వీటికితోడు అక్కడ నిర్మాణ పరిశ్రమకు కీలకమైన నదీ ఇసుక, కంకర కోటాను 25 శాతం మేర అంటే వెయ్యి మెట్రిక్ టన్నులకు పెంచింది.


Click it and Unblock the Notifications