ఈ క్యాలెండర్ ఏడాది ప్రారంభంలో కరోనా మహమ్మారి తగ్గడంతో దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పసిడి ధరలు పెరిగినప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.8500 వరకు తక్కువగానే ఉన్నాయి. ఆల్ టైమ్ గరిష్టంతో ధరలు తగ్గడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన నేపథ్యంలో పసిడికి మరింత డిమాండ్ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో కూడా కొనుగోళ్లు పెరిగాయి. దీంతో బంగారం దిగుమతులు పెరిగాయి.
ఏప్రిల్ నెలలో 630 కోట్ల డాలర్ల విలువైన పసిడి దిగుమతులు నమోదయ్యాయి. ఇదే నెలలో వెండి దిగుమతులు 88.53 శాతం క్షీణించి 1.19 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత ఏడాది ఏప్రిల్ నెలలో బంగారం దిగుమతుల విలువ కేవలం 283 కోట్ల డాలర్లుగా ఉంది. బంగారం దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు 1,510 కోట్ల డాలర్లకు పెరిగింది.

ఈ ఏడాది తొలిసారిగా నమోదైన వాణిజ్యలోటు ఇది. గత ఏడాది ఏప్రిల్ నెలలో వాణిజ్య లోటు 676 కోట్ల డాలర్లుగా ఉంది. దేశాన్ని వణికిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల రాబోయే నెలల్లో డిమాండ్ తగ్గవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications