అమెరికా ప్రపంచ దేశాలపై పరస్పర సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మార్చి, ఏప్రిల్ నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలుపై దృష్టి పెట్టడమే అతిపెద్ద కారణం. అయితే క్లిష్ట సమయాల్లో బంగారంని పెట్టుబడి పెట్టడాన్ని సురక్షితమైన అప్షన్'గా కేంద్ర బ్యాంకులు పరిశీస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే రిజర్వ్ బ్యాంక్ కూడా ఎక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాలలో భారతదేశం ఇప్పుడు ఏడవ స్థానానికి చేరుకుంది. అలాగే గత ఐదు ఏళ్లలో చూస్తే RBI వద్ద ఉన్న బంగారు నిల్వలు 35% పెరిగాయి. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు. భారతదేశం ఇప్పటికే ఏడవ అతిపెద్ద బంగారం నిల్వలు ఉన్న దేశంగా ఉండగా, RBI ఎందుకు అంతగా బంగారాన్ని కొనుగోలు చేస్తుందో తెలుసా..

ప్రపంచ సంక్షోభం, బంగారం డిమాండ్: గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం ఎన్నో ఆర్థిక కుదుపులను చూసింది. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా వ్యాపార వివాదాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచాయి. ఈ సంక్షోభాల మధ్య బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. కాబట్టి బంగారం ఎప్పటికి కూడా ఒక సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుకోవడానికి కూడా ఇదే కారణం. బంగారం ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడంతో పాటు కరెన్సీ విలువలో హెచ్చుతగ్గుల నుండి కూడా రక్షిస్తుంది.
భారతదేశంలో పెరుగుతున్న బంగారు నిల్వలు: గత కొన్ని సంవత్సరాలుగా RBI బంగారు నిల్వలను వేగంగా పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే RBI 57.5 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2017 తర్వాత ఏ సంవత్సరంలో కూడా జరగని అతిపెద్ద కొనుగోలు ఇది. గత ఐదు సంవత్సరాలలో రిజర్వ్ బ్యాంక్ బంగారు నిల్వలు 35% పెరిగాయి. 2020లో భారతదేశంలో 653 టన్నుల బంగారం ఉండగా, మార్చి 2025 నాటికి 880 టన్నులకు పెరిగింది. ప్రపంచ బంగారు నిల్వలలో భారతదేశం ఏడవ స్థానంలో ఉంది. 2015లో ఈ లిస్టులో భారతదేశం పదవ స్థానంలో ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం, భారతదేశం మొత్తం విదేశీ మారక నిల్వలో 11.35% బంగారం ఉంది.
ఆర్‌బిఐ ఎందుకు అంతగా బంగారాన్ని కొనుగోలు చేస్తోందంటే : ఆర్‌బిఐ బంగారం కొనుగోలుకు అతిపెద్ద కారణం అమెరికా డాలర్ అస్థిరత. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో డాలర్ విలువ చాలా హెచ్చుతగ్గులను చూసింది. బంగారం ఒక స్థిరమైన అప్షన్, ఇది అర్దిక ప్రమాదాన్ని తగ్గిస్తుంది. US డాలర్ ప్రపంచంలోనే అగ్రగామి రిజర్వ్ కరెన్సీ, కానీ దాని విలువలో మార్పులు, పెరుగుతున్న US ట్రెజరీ రాబడి కేంద్ర బ్యాంకులకు ప్రమాదాన్ని పెంచాయి. చాలా బ్యాంకులు డాలర్ నిల్వలను తగ్గించుకుని బంగారంలో పెట్టుబడి పెడుతున్నాయి. సెప్టెంబర్ 2022 నుండి RBI భారతదేశానికి 214 టన్నుల బంగారాన్ని తీసుకువచ్చింది. ప్రపంచ అస్థిరత మధ్య దేశంలో బంగారు నిల్వలను పెంచే విధానాన్ని ఈ చర్య అద్దం పడుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications