కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నీరుగారిపోతోంది. వివిధ దేశాల వృద్ధి రేటు దశాబ్దాల కనిష్టానికి పడిపోతోంది. చాలా దేశాల వృద్ధి రేటు మైనస్‌లలోకి జారుకుంటోందని రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అయితే భారత్, చైనా వంటి దేశాల వృద్ధి రేటు మిగతా చాలా దేశాల కంటే కాస్త బెట్టర్ అని కూడా ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలే ఎక్కువ అంటున్నారు.

మిగతా దేశాలతో పోలిస్తే అంత ఆందోళన లేదు
ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయని, సెన్సెక్స్ ఇప్పటి వరకు 25 శాతం, నిఫ్టీ 26 శాతం తగ్గాయని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. అయితే భారత స్థూల ఆర్థిక వ్యవస్థపై అంతగా ఆందోళన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయన్నారు.

ఫారన్ రిజర్వ్ ఎక్కువ
మొదట మనకు తగినంత విదేశీ నిల్వలు ఉన్నాయని దీపక్ పరేఖ్ అన్నారు. ఎన్నారైల నుండి భారీ మొత్తంలో విదేశీ నిధులు వస్తున్న వాటిలో భారత్ ముందు ఉందని చెప్పారు. ఇది మన కరెన్సీ సమతౌల్యం కోసం ఉపయోగపడుతుందన్నారు. మనకు ఇన్‌ఫ్లో ఎక్కువ అని, అందుకే కరెన్సీ రిస్క్ తక్కువ అన్నారు.

రెండోది.. మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ కాదు
మరో విషయం ఏమంటే భారత్ మానుఫ్యాక్చరింగ్ ఆధారిత దేశం కాదని దీపక్ పరేఖ్ చెప్పారు. ప్రధానంగా సేవా ఆధారిత వ్యవస్థ మన వద్ద ఉందని తెలిపారు. ఇప్పటికే మన వద్ద ఐటీ, కాల్ సెంటర్లు, బ్యాంకులు, ఆన్ లైన్ వంటి సేవలు కరోనా కారణంగా కొంతమేర ప్రభావితమయ్యాయని, అయినప్పటికీ ముందుకు సాగుతున్నాయన్నారు.

అన్ని రంగాలకు దెబ్బ
కరోనా కారణంగా వివిధ రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంపై కూడా ప్రభావం ఎక్కువే పడింది. అందుబాటులోని గృహాలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని దీపక్ పరేఖ్ అన్నారు.రియల్ రంగానికి ఇచ్చిన రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని కూడా సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిధుల కొరత, కఠిన పరిస్థితులు ఎదుర్కొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ ఓకే కానీ..
ప్రస్తుత పరిస్థితుల్లో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ నిర్మాణరంగం స్వాగతించింది. అయితే కట్టుదిట్టమైన రక్షణ చర్యలను తీసుకొని డెవలపర్లు నిర్మాణ కార్యకలాపాలు చేపట్టేందుకు ఉద్దీపనలు ప్రకటించాలని కోరింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications