ఇండియాలో పెరిగిపోతున్న కోటీశ్వరులు: మొత్తం 191 మంది, 100 లక్షల కోట్ల ఆస్తులు.. !

మిమ్మల్ని అత్యంత ధనవంతులు ఎవరు అని అడిగితే టక్కున అంబానీ పేరు లేదా అది పేరు చెబుతారు. ఎందుకంటే వీరు వ్యాపార సామ్రాజ్యంలో అత్యునత స్థాయికి ఎదిగి కోటీశ్వరులుగా మారారు కూడా. అలాగే వీరు చేసే వ్యాపారాలు దేశాలు దాటి విదేశాలకు కూడా వ్యాపించింది. ప్రస్తుతం మనదేశంలో ఎంతమంది అత్యంత ధనవంతులు ఉన్నారో మీకు తెలుసా... విషయం ఏంటంటే ఇండియాలో భారతీయ ధనవంతుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈ లెక్కన చూస్తే ఇప్పుడు దేశంలో బిలియనీర్ల సంఖ్య 191కి చేరుకుంది. ఇది మాత్రమే కాదు, ఈ ధనవంతుల మొత్తం సంపద గురించి మాట్లాడితే దాదాపు రూ.100 లక్షల కోట్లకు చేరుకుంది. నివేదికల ప్రకారం, 2024 సంవత్సరంలో దేశంలో 26 మంది కొత్త బిలియనీర్లు ఈ లిస్టులో చేరారు. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం, గత ఆరు సంవత్సరాలలో భారతదేశంలో ధనవంతుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది.

అయితే ఈ అద్భుతం కేవలం ఆరు సంవత్సరాలలో సాధించింది. నైట్ ఫ్రాంక్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025 గత బుధవారం విడుదలైంది. అందులో ధనవంతుల గణాంకాలు విడుదలయ్యాయి. ఆరు సంవత్సరాల క్రితం భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య కేవలం 7 మంది మాత్రమే ఉండేదని, కానీ అది సంవత్సరం తర్వాత సంవత్సరానికి పెరుగుతోందని, ఇప్పుడు భారతదేశంలో మొత్తంగా 191 మంది బిలియనీర్లు ఉన్నారని పేర్కొంది. ఈ నివేదిక నిజమైతే భారతీయుల మొత్తం సంపద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది. ఈ విషయంలో అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండవ స్థానంలో ఉన్నాయి.

India has Billionaires 191 billionaires with assets close to 100 lakh crores along number of rich peoples also increasing in India

భారతీయ బిలియనీర్ల సంఖ్య పెరగడమే కాకుండా $10 మిలియన్లకు పైగా ఆస్తులు ఉన్న ధనవంతుల ఖజానా నిరంతరం నిండిపోతోంది. ఈ సంఖ్యకు మించి నికర విలువ కలిగిన భారతీయుల సంఖ్య ఇప్పుడు 85,698కి చేరుకుందని అలాగే రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్యా దాదాపు 94,000కి చేరుకుంటుందని నివేదిక అంచనా వేసింది. నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ మాట్లాడుతూ, ధనవంతుల సంఖ్యలో స్థిరమైన పెరుగుదల దేశం యొక్క బలమైన దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న పెట్టుబడి అవకాశాలు ఇంకా పెద్ద అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను ప్రతిబింబిస్తుందని, ఇది ప్రపంచ సంపద సృష్టిలో భారతదేశాన్ని ముఖ్య పాత్రధారిగా స్థిరపరుస్తుందని అన్నారు.

ప్రపంచంలోని 40% సూపర్ రిచ్‌లు అమెరికాలో ఉన్నారు.

నైట్ ఫ్రాంక్ నివేదిక ప్రకారం, ధనవంతుల సంఖ్యలో అమెరికా ముందంజలో ఉంది ఇంకా ప్రపంచంలోని 40% సూపర్ రిచ్‌లు (HMWI) కూడా ఇక్కడే ఉన్నారు, వీరి నికర విలువ $10 మిలియన్ల కంటే ఎక్కువ. అమెరికాలో 9 లక్షల మంది ఇలాంటి ధనవంతులు ఉన్నారు. ఈ తరుణంలో అమెరికా తర్వాత, చైనా రెండవ స్థానంలో ఉంది & ఇక్కడ 4.7 లక్షల మంది సూపర్ రిచ్‌లు నివసిస్తున్నారు, ఇక భారతదేశంలో వీరి సంఖ్య 85,698 మరోవైపు మనం జపాన్ గురించి మాట్లాడుకుంటే, అక్కడ దాదాపు 65,000 HMWI ఉన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+