Richest village: ఆసియాలో అత్యంత ధనిక గ్రామం మన దేశంలోనే.. కేవలం ఫిక్స్‌డ్ డిపాజిట్లే 7 వేల కోట్లు
Village economy: సరైన మౌలిక సదుపాయాలు, వసతులు లేకుండా పేదరికంలో మగ్గిపోతున్న గ్రామాలు దేశంలో కోకొల్లలు. అయితే వాటికి భిన్నంగా ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న గ్రామం మన దేశంలోనే ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. వేలాది కోట్ల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో పలు బ్యాంకుల్లో మూలుగుతున్నాయక్కడ. ఆ ఊరి విశేషాలేంటో తెలుసుకుందాం.
గుజరాత్‌లోని కచ్ఛ్ జిల్లా భుజ్ శివార్లలో ఉన్న మాదాపర్ ఆసియాలోనే అత్యంత సంపన్న గ్రామంగా పేరుగాంచింది. అక్కడ నివాసితులకు ఏకంగా 7 వేల కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. ఇక్కడ పటేల్ కమ్యూనిటీ ప్రాభవం ఎక్కువగా ఉంటుంది. 2011లో ఈ గ్రామంలో దాదాపు 17 వేల మంది నివసిస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 32 వేలకి పెరిగింది.

గ్రామం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం అందులోని నాన్‌రెసిడెంట్ ఇండియన్ (NRI) కుటుంబాలు. స్థానిక బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కోట్లాది రూపాయలను వారు జమచేస్తాయని జిల్లా పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ పరుల్‌బెన్ కారా తెలిపారు. ఇక్కడి 20 వేల కుటుంబాలలో 1,200 మంది విదేశాల్లో అందులోనూ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో నివసిస్తున్నట్లు చెప్పారు.
మాదాపర్‌లో HDFC, SBI, PNB, యాక్సిస్, ICICI మరియు యూనియన్ బ్యాంక్‌ల వంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన 17 ప్రధాన బ్యాంకులు ఉన్నాయి. గ్రామ ఎకానమీ ఆధారంగా మరిన్ని బ్యాంకులు తమ శాఖలను తెరవడానికి సిద్ధంగా ఉన్నాయి. చాలా మంది గుజరాతీలు సెంట్రల్ ఆఫ్రికాలో నిర్మాణ వ్యాపారాలలో పనిచేస్తున్నారు. వారు UK, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో విదేశాలలో నివసిస్తున్నప్పటికీ డబ్బు దాచేందుకు ఇప్పటికీ తమ గ్రామంలోని బ్యాంకులనే ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు.


Click it and Unblock the Notifications