బంగారం (Gold) అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఆపదలో ఆదుకునే ఆస్తి. అంతర్జాతీయంగా ధరలు ఆకాశాన్ని తాకుతున్నా.. మన దేశ ప్రజలు మాత్రం పసిడిపై తమ మమకారాన్ని ఏ మాత్రం తగ్గించుకోవడం లేదు. ఈ అపురూపమైన లోహంపై భారతీయులకు ఉన్న నమ్మకానికి తాజా గణాంకాలే నిదర్శనం.

మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూన్ నాటికి భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం (Gold) నిల్వలు సుమారు 34,600 టన్నులకు చేరుకున్నాయి. నగలు, బంగారం కడ్డీలు (Bullion), బిస్కెట్లు, నాణేల రూపంలో ఉన్న ఈ అపారమైన సంపద ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ. 342 లక్షల కోట్లుగా అంచనా.
ప్రపంచ రికార్డు
భారతీయుల దగ్గర ఉన్న బంగారం విలువ ఎంత పెద్దదంటే.. ఇది భారతదేశ ప్రస్తుత స్థూల దేశీయోత్పత్తి (GDP)లో ఏకంగా 88.8 శాతంకు సమానం! సాధారణంగా సెంట్రల్ బ్యాంకులు (Central Banks) మాత్రమే పెద్ద మొత్తంలో బంగారం నిల్వ చేస్తాయి. కానీ, భారతదేశంలో ప్రజలు వ్యక్తిగతంగా ఇంత భారీ మొత్తంలో పసిడిని కలిగి ఉండడం ప్రపంచంలోనే ఒక రికార్డు.
ఆభరణాల నుంచి బులియన్ వైపు
గతంలో.. మన దేశంలో బంగారం అంటే కేవలం ఆభరణాలుగా మాత్రమే కొనుగోలు చేసేవారు. అయితే రాబడి, పెట్టుబడి భద్రతపై అవగాహన పెరుగుతున్న కొద్దీ భారతీయుల కొనుగోలు ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న బంగారంలో నాలుగింట మూడు వంతులు నాణేలు లేదా కడ్డీల రూపంలోనే కొనుగోలు చేస్తున్నారు. అంటే ప్రజలు బంగారాన్ని కేవలం ధరించడానికి కాకుండా, లాభదాయకమైన పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. గత సంవత్సరంలో బంగారం అరవై శాతానికి పైగా లాభాలను అందించడంతో ఈ ధోరణి మరింత ఊపందుకుంది. దీనికి అనుగుణంగానే మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కూడా గోల్డ్ ఈటీఎఫ్‌లు (Gold ETFs), మల్టీ అసెట్ ఫండ్స్ వంటి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి భారీగా నిధులను సమీకరిస్తున్నాయి.
పెట్టుబడికి ఆభరణాలు సరికాదు..
కేవలం పెట్టుబడి లాభాల కోసమే బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఆభరణాల రూపంలో కొనడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే..
- తరుగు, తయారీ చార్జీలు: ఆభరణాల తయారీకి అదనంగా తరుగు (Wastage), తయారీ (Making) ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.
- రాళ్లు, రత్నాల విలువ: నగల విలువలో 30 నుంచి 35 శాతం వరకు రాళ్లు, రత్నాలకే కేటాయించడం జరుగుతుంది. వీటిని విక్రయించేటప్పుడు బంగారం విలువ మాత్రమే లెక్కిస్తారు, ఈ అదనపు విలువ తిరిగి రాదు.
- లాభదాయకత: ఆభరణాల పెట్టుబడిపై లాభాలు రావాలంటే.. బంగారం ధర కనీసం ఏటా 30% చొప్పున పెరగాల్సి ఉంటుంది.
దీనిని దృష్టిలో ఉంచుకుని, పెట్టుబడి లాభాల కోసం చూసేవారు భౌతిక బంగారం (Physical Gold) కంటే గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGBs) వంటి డిజిటల్ లేదా కాగిత రూప బంగారంలో మదుపు చేయడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

Gold price: బంగారం ధర ఎందుకు నెమ్మదించింది? భారీ పెరుగుదల ఉంటుందా లేక తగ్గుతుందా?

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం, డైమండ్లపై భారీ డిస్కౌంట్లు!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications