భారతదేశంలో గోల్డ్ లోన్(Gold Loan) మార్కెట్ ఎన్నడూ లేనంతగా ఊపు అందుకుంది. బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటున్నవారు రోజురోజుకీ పెరుగుతున్నారు. అంచనాలకు మించి ఈ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. గోల్డ్ లోన్ సంస్థలు (NBFC) రాబోయే 12 నెలల్లో ఏకంగా 3,000 కొత్త శాఖలను తెరవాలని భారీ ప్రణాళికలు వేస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
ప్రస్తుతం గోల్డ్ లోన్ మార్కెట్ ఎక్కువగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆధిపత్యంలో ఉంది. ఈ మార్కెట్ సెప్టెంబర్ చివరి నాటికి ఏకంగా 36% వృద్ధిని నమోదు చేసి రూ.14.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి NBFCలు ప్రత్యేకంగా గోల్డ్ లోన్ శాఖలను అందుబాటులోకి తెస్తున్నాయి.

డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?
బంగారం రుణాలకు డిమాండ్ పెరగడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఈ రోజుల్లో లోన్ పొందడం కాస్త కష్టమైన విషయంగా మారింది. ఎలాంటి సేఫ్టీ లేకుండా సంస్థలు లోన్ ఇవ్వడం లేదు. దీంతో డబ్బు అవసరం ఉన్నవారు తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్స్ పొందుతున్నారు. గోల్డ్ లోన్ సంస్థలు కూడా ఈ తరహా లోన్స్ లో ఎక్కువ లాభం ఉండడంతో ఈజీగా లోన్స్ అప్రూవ్ చేస్తున్నాయి. ఇక మరో కారణం బంగారం ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతుండటం లోన్ తీసుకునేవారికి వరంగా మారింది. అధిక బంగారం ధరల వలన తక్కువ బంగారంతోనే ఎక్కువ రుణ మొత్తాన్ని పొందగలుగుతున్నారు.
పెరుగుతున్న గోల్డ్ లోన్ మార్కెట్
నిపుణుల అంచనా ప్రకారం గోల్డ్ లోన్ మార్కెట్ అనుకున్న దానికంటే ఒక సంవత్సరం ముందే, అంటే 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.15 లక్షల కోట్ల మార్కును చేరుకుంటుంది. ఈ వృద్ధికి గల ముఖ్య కారణం ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం నిల్వలను పెంచడం. తద్వారా బంగారం ధరలకు మంచి మద్దతు లభించడం. ఈ ఉత్సాహంతో ప్రముఖ NBFCలు తమ సంస్థలను భారీగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
- ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ ఫిన్‌కార్ప్, IIFL ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి అగ్రశ్రేణి సంస్థలు మొత్తం 1,800 కొత్త శాఖలు తెరవాలని చూస్తున్నాయి.
- బజాజ్ ఫైనాన్స్ ఒక్కటే మార్చి 2027 నాటికి 900 కొత్త శాఖలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- IIFL ఫైనాన్స్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 500 శాఖలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తోంది.
- L&T ఫైనాన్స్ వంటి సంస్థలు ఇప్పటికే చిన్న కంపెనీలను కొనుగోలు చేసి ఈ మార్కెట్‌లోకి ప్రవేశించాయి.
- పూనావాలా ఫిన్‌కార్ప్ వంటి కంపెనీలు కూడా తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి వేగంగా పనిచేస్తున్నాయి. వీటిలో 95% శాఖలు టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లో రావడం విశేషం.
లోన్స్ ఎవరు తీసుకుంటున్నారు?
గోల్డ్ లోన్స్ ను ప్రస్తుతం వ్యవసాయం, చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు ఎక్కువగా(దాదాపు 70%) తీసుకుంటున్నారు. వీళ్లతోపాటు పెళ్లిళ్లు లేదా ఇతర ఆర్థిక అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఉద్యోగులు కూడా స్వల్పకాలిక నగదు అవసరాల కోసం ఈ లోన్స్ తీసుకుంటున్నారు.
త్వరలోనే కొత్త బ్రాంచీలు
గోల్డ్ లోన్ సంస్థలు వచ్చే ఏడాది కల్లా వీలైనన్ని కొత్త శాఖలను తెరిచే ప్లాన్ లో ఉన్నాయి. ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే బలమైన గది, సేఫ్ వాల్ట్, నిఘా కెమెరాలు వంటివి చాలానే అవసరం అవుతాయి. ఒక్కో శాఖకు రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. అలాగే ఒక గోల్డ్ లోన్ శాఖ సాధారణంగా లాభాల్లోకి రావడానికి 1 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది.
More From GoodReturns

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

Interest rates: రేపే RBI పాలసీ నిర్ణయం! లోన్ EMI పెరుగుతుందా? వడ్డీ రేట్లపై క్లారిటీ ఇదే!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications