Gold Prices: 2022-23 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో బంగారం దిగుమతుల వివరాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే గోల్డ్ దిగుమతులు దాదాపు 30 శాతం క్షీణించాయి. దిగుమతుల విలువ 31.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు వీటి విలువ 45.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ప్రధానంగా కస్టమ్స్ డ్యూటీ పెంచటం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలు నిలిచాయి. బంగారంపై అధిక దిగుమతి సుంకం డిమాండ్ గణనీయంగా తగ్గటానికి ప్రధాన కారణంగా ఉంది. ఈ క్రమంలో భారత పసిడి దిగుమతులు 600 టన్నులుగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉన్న భారత్ పరిమాణ పరంగా ఏటా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. అయితే ధరల పెరుగదలతో కొత్త కొనుగోళ్లు మందగించగా.. పాత బంగారాన్ని చాలా మంది విక్రయించారు.

తాజా డేటా ప్రకారం డ్రాగన్ దేశం గత నెలలో 18 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే మరింత గోల్డ్ కొనాలని చూస్తున్న తరుణంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గడచిన 5 నెలలుగా చైనా బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో నవంబర్ నుంచి ఏకంగా 120 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుత మార్కెట్ గందరగోళాల మధ్య బంగారం ధరలు కొత్త గరిష్ఠాలను తాకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి చైనా సెంట్రల్ బ్యాంక్ నికర కొనుగోలు 125 టన్నులుగా ఉందని తెలుస్తోంది.
దేశంలో ఈరోజు బంగారం ధరలను గమనించినట్లయితే స్వల్పంగా తగ్గాయి. అమెరికా జాబ్ డేటా గణాంకాలు వెలువడటం కూడా దీనికి కారణంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.61,100, ముంబైలో రూ.60,430, దిల్లీలో రూ.60,580, బెంగళూరులో రూ.60,480, హైదరాబాదులో రూ.60,430, విజయవాడలో రూ.60,430, విశాఖపట్నంలో రూ.60,430, నెల్లూరులో రూ.60,430, తిరుపతిలో రూ.60,430గా ఉన్నాయి. ఏపీలోని ఇతర నగరాల్లో సైతం బంగారం ధర ఇదే రేటులో కొనసాగుతోంది. ఈ క్రమంలో వెండి ధరలు మాత్రం పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీకి వెండి ధర నిన్నటి కంటే రూ.300 తగ్గిన తర్వాత రూ.76,300గా ఉంది.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న 455 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. దీని విలువ రూ.21 లక్షలని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారాన్ని ట్రాలీ చక్రాల స్క్రూలు, రాడ్‌ల రూపంలో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు పరిశీలనలో తేలింది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications