Tour spenings: టూర్స్ కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్న ఇండియన్స్.. 2030 నాటికి ప్రపంచంలోనే..
Tour spenings: ఈమధ్య భారతీయుల్లో టూర్స్ పట్ల ఉత్సాహం పెరుగుతోంది. ముఖ్యంగా నేటి యువతరం నాలుగు గోడల మధ్య బతకడానికి ఇష్టపడటం లేదు. ఖాళీ దొరికినప్పుడల్లా ట్రెక్కింగ్, విహారయాత్రలు, విదేశాలకు టూర్స్ ప్లాన్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది. వెరసి దేశీయ పర్యాటక పరిశ్రమ శర వేగంతో దూసుకు పోతోంది.
కరోనా మహమ్మారి అనంతరం ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకంపై ఖర్చు చేస్తున్నారు. 2030 నాటికి కేవలం ట్రావెలింగ్ కోసం భారతీయులు వెచ్చించే మొత్తం 410 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. తద్వారా ప్రపంచంలో పర్యాటకం కోసం అధికంగా వెచ్చించే నాలుగవ దేశంగా ఇండియా నిలవనుందని గణాంకాలు చెబుతున్నాయి.

2019లో కరోనా ముందటితో పోలిస్తే భారీగా 173 శాతం ఎక్కువగా ప్రజలు ప్రయాణాల కోసం ఖర్చు పెడుతున్నారు. సగటున 150 బిలియన్ డాలర్లు వెచ్చిస్తూ ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మేరకు 'హౌ ఇండియా ట్రావెల్స్' పేరిట బుకింగ్స్ డాట్ కామ్ మరియు మెకిన్సే & కంపెనీ సంయుక్తంగా ఓ నివేదికను రిలీజ్ చేశాయి.
అమెరికన్లు సగటున 63 రోజులు, జపాన్ ప్రజలు 57 రోజులతో పోలిస్తే భారతీయులు టూర్స్ కోసం 29 రోజులు వెచ్చిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. భారతీయ పర్యాటకుల్లో 80 శాతం మంది బస చేసేందుకు రెస్టారెంట్లు, రూమ్ సర్వీస్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదిక పేర్కొంది. సాంప్రదాయ మనాలీ, సిమ్లా వంటి ప్రాంతాలతో పాటు వారణాసి, గురుగ్రాం, కోయంబత్తూరు తరహా నగరాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తున్నట్లు వెల్లడించింది.
2022లో 91 శాతం మంది పర్యాటకులకు యూట్యూబ్లోని వీడియోస్ తమకు ట్రావెలింగ్ ఇనిస్పిరేషన్ అని బుకింగ్స్ డాట్ కామ్ నివేదిక పేర్కొంది. 85 శాతం మందిని ఇన్ స్టాగ్రామ్ ప్రభావితం చేసినట్లు చెప్పింది. స్పోర్ట్స్, దౌత్య సమావేశాలు, మ్యూజికల్స్ వంటి ఇతర ఈవెంట్స్ పర్యాటకాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications