సరిహద్దు దేశాలతో ఇండియా ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. కలిసి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని చూస్తుంది. ఇందుకోసం సాధ్యమైనంత వరకు అన్ని విషయాల్లో స్నేహ హస్తం అందిస్తూ ఉంటుంది. తాజాగా నేపాల్ కు భారత్ ఓ మంచి గిఫ్ట్ ఇచ్చింది. తద్వారా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలంగా మారనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నేపాల్-ఇండియా డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ ప్రోగ్రామ్ కింద భారత్ 43 అంబులెన్స్‌లు, 50 స్కూల్ బస్సులను నేపాల్‌కు బహుమతిగా ఇచ్చింది. అక్కడి రాయబార కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. మన రాయబారి నవీన్ శ్రీవాస్తవ సమక్షంలో ఆయా వాహనాల తాళాలను నేపాల్ ఎడ్యుకేషన్, టెక్నాలజీ మంత్రి అశోక్ రాయ్ చేతులమీదుగా వివిధ లబ్ధిదారు సంస్థలకు అందజేశారు.

'నేపాల్ లో 2 లేదా 3 పాఠశాలలను కలిపి ఒకటిగా విలీనం చేస్తున్నాం. తద్వారా విద్యార్థులు ప్రయాణించాల్సిన దూరు పెరుగుతుంది. అందువల్ల స్కూల్ బస్సులకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఈ బస్సులు మాకు చాలా అవసరం. వెహికల్స్ సపోర్ట్ చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో ఇండియా నుంచి మరింత మద్ధుతు, సహాయాన్ని ఆశిస్తున్నాం' అని అశోక్ రాయ్ తెలిపారు.
1994 నుంచి నేపాల్-ఇండియా డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ వస్తున్నారు. దీని కింద ఇప్పటివరకు మొత్తం 974 అంబులెన్స్‌లు, 234 స్కూల్ బస్సులను నేపాల్ కు భారత ప్రభుత్వం బహుమతిగా అందించింది. ఇక్కడి ఆరోగ్యం, విద్యా రంగాలకు భారత్ నిరంతర మద్దతు ఉంటుందని నవీన్ శ్రీవాస్తవ ప్రకటించారు. రాబోయే రోజుల్లో స్కూల్ బస్సుల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications