LPG ATM : దేశంలోనే తొలి గ్యాస్ ఏటీఎం వచ్చేసింది.. నిముషంలో నిండు సిలిండర్ మీ సొంతం!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సరఫరాలో కొన్ని చోట్ల అనిశ్చితి కనిపిస్తున్న తరుణంలో సామాన్యులకు ఊరటనిచ్చే ఒక అద్భుత వార్త వెలుగులోకి వచ్చింది. మనం ఏటీఎం మెషీన్ నుండి డబ్బులు డ్రా చేసినట్లే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌ను కూడా తీసుకోవచ్చు. భారతదేశపు మొట్టమొదటి 24*7 ఎల్పీజీ (LPG) ఏటీఎం ఇటీవల ప్రారంభమైంది. వినియోగదారులకు నిమిషాల వ్యవధిలోనే వంట గ్యాస్ అందించడమే ఈ వినూత్న ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. అసలు ఈ ATM ఎక్కడుంది? ఎలా పనిచేస్తుంది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

India gets its first 24 7 LPG ATM in Gurugram Get cooking gas cylinder in 2 minutes Check details

ఎల్పీజీ ఏటీఎం ఎక్కడ ఉంది?

హర్యానాలోని గురుగ్రామ్, సోహ్నా సెక్టార్ 33 లో ఉన్న ఒక రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌ లో ఈ ఆటోమేటెడ్ వెండింగ్ సిస్టమ్‌ ను ఏర్పాటు చేశారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) పైలట్ ప్రాజెక్టులో భాగంగా దీనిని ప్రవేశపెట్టింది. గ్యాస్ ఏజెన్సీ వాళ్లు ఎప్పుడు వస్తారో అని గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేకుండా కేవలం 2 నుండి 3 నిమిషాల్లోనే ఖాళీ సిలిండర్‌ను ఇచ్చి నిండు సిలిండర్‌ను ఇక్కడ పొందవచ్చు.

ఈ ఏటీఎం ఎలా పనిచేస్తుంది?

ఈ మెషీన్ పూర్తిగా డిజిటల్, కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో పనిచేస్తుంది. దీనిని ఉపయోగించడం చాలా సులభం..

  • రిజిస్ట్రేషన్: ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను మెషీన్‌లో ఎంటర్ చేయాలి.
  • వెరిఫికేషన్: మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ (OTP) తో వెరిఫై చేయాలి.
  • స్కానింగ్: మీ దగ్గర ఉన్న ఖాళీ సిలిండర్‌పై ఉండే బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
  • పేమెంట్: యూపీఐ (UPI), క్రెడిట్/డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. డబ్బులు చెల్లించగానే, మెషీన్ ఆటోమేటిక్‌గా నిండు సిలిండర్‌ను బయటకు విడుదల చేస్తుంది , ఖాళీ సిలిండర్‌ను లోపలికి తీసుకుంటుంది.

కంపోజిట్ సిలిండర్ల ప్రత్యేకత ఏంటి?

ఈ LPG ఏటీఎంలో వాడే సిలిండర్లు మనం రెగ్యులర్‌గా వాడే ఇనుప సిలిండర్లు కావు. వీటిని 'కంపోజిట్ సిలిండర్లు' అంటారు. ఇవి ఫైబర్‌తో తయారవుతాయి.

  • బరువు: మామూలు సిలిండర్లు గ్యాస్‌తో కలిపి 31 కిలోల వరకు ఉంటే, ఈ కంపోజిట్ సిలిండర్లు కేవలం 15 కిలోలు మాత్రమే ఉంటాయి. వీటిని ఎవరైనా సులభంగా మోయవచ్చు.
  • భద్రత: ఇవి తుప్పు పట్టవు , చూడటానికి చాలా నీట్‌గా ఉంటాయి. పేలుడు ప్రమాదాలు కూడా చాలా తక్కువ.
  • సామర్థ్యం: ఈ ఏటీఎం మెషీన్‌లో ఒకేసారి 10 సిలిండర్లను నిల్వ చేయవచ్చు. స్టాక్ అయిపోగానే సంబంధిత ఏజెన్సీకి ఆటోమేటిక్‌గా అలర్ట్ వెళ్తుంది, తద్వారా వెంటనే స్టాక్ రీఫిల్ చేస్తారు.

ఏదేమైనా నగరవాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇలాంటి ఆధునిక సాంకేతికతను ఇంధన పంపిణీ వ్యవస్థలో ప్రవేశపెడుతోంది. గ్యాస్ సరఫరాలో ఒత్తిడి ఉన్న సమయంలో ఇటువంటి ఏటీఎంలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం గురుగ్రామ్‌లో ప్రారంభమైన ఈ సేవలు, త్వరలోనే దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. కేవలం పాత సంప్రదాయ డెలివరీ పద్ధతులపైనే ఆధారపడకుండా, ఇలాంటి ఆధునిక మార్గాలను ఎంచుకోవడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా పారదర్శకత కూడా పెరుగుతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+