India's GDP: 2023లో భారత్ అనేక విజయాలను సాధించింది. చంద్రయాన్ సక్సెస్ నుంచి అస్థిర ప్రపంచ పరిస్థితుల్లో తటస్థంగా నిలబడటం వరకు చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
తాజాగా ఈక్రమంలో భారత జీడీపీ వృద్ధి కూడా వచ్చి చేరింది. అవును ఎప్పటి నుంచో కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ ఇండియా జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే ఒక అద్భుతం చోటుచేసుకుంది. భారత లక్ష్యానికి మరో అడుగు దగ్గరగా మన జీడీపీ వచ్చి చేరింది.

శనివారం అంటే నవంబర్ 18, 2023న భారత ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్ల నామినల్ జీడీపీ మార్కును తాకింది. దీంతో అధికారికంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 333 లక్షల కోట్ల విలువైన ఎకానమీగా గుర్తింపును అందుకుంది. దీంతో ప్రపంచాన్ని ముందుకు నడిపించేందుకు ఆసియా నుంచి భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఒడిఒడిగా విజయాలను అందిస్తున్నాయని అనేక మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒకప్పుడు మోదీ చెప్పిన 5 ట్రిలియన్ ఎకానమీని అందుకోలేమంటూ కొందరు చేసిన కామెంట్స్ అబద్ధం అని తాజా పరిణామం రుజువు చేస్తోంది. భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని తాజా గణాంకాలు నిరూపించాయి.
భారత్ కొత్త శిఖరాలను అధిరోహించటంపై నెట్టింట సంతోషం వెల్లివిరుస్తోంది. ప్రపంచానికి భారత ఆర్థిక వ్యవస్థ నడుపుతున్న తీరు ఆదర్శదాయకమైనదని సారికా చందన్ అనే మహిళ పేర్కొన్నారు. అయితే ఈ పూర్తి క్రెడిట్ ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. మోదీ నేతృత్వంలో దేశం మరిన్ని మైలురాళ్లను అందుకుంటుందని చాలా మంది ఆశాజనకంగా ఉన్నారు. అయితే తాజా మైలురాయి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి కేంద్రంలో పాగా వేసేందుకు ప్రచార అస్త్రంగా మారుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications