Intellectual Property: అంతర్జాతీయ విపణిలో భారతీయులకు ఆదరణ పెరుగుతోంది. మన మేధో సంపత్తికి అగ్రరాజ్యాలు సైతం తలొగ్గక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రపంచంలోని టాప్ కంపెనీల అధినేతల్లో ఇండియన్స్ హవా కొనసాగుతోంది. దీనికి మరింత బూస్ట్ ఇచ్చే విధంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఓ ప్రకటన చేశారు.
గత 10 నెలల్లో భారత పేటెంట్ కార్యాలయం 75 వేల పేటెంట్లకు అనుమతి మంజూరు చేసినట్లు కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కొత్త ఆవిష్కరణలలో దేశ సామర్థ్యాన్ని ఈ సంఖ్య ప్రతిబింబిస్తోందంటూ హర్షం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొందరు ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు.

వ్యాపారాన్ని ప్రభుత్వం సులభతరం చేస్తోందని మంత్రి వివరించారు. చట్టాలను సరళీకృతం చేయడంతో పాటు నియమ నిబంధనల భారాన్ని తగ్గిస్తున్నట్లు చెప్పారు. జన్ విశ్వాస్ చట్టం ఆ దిశగా మొదటి అడుగు అని గుర్తుచేశారు. ఇది వ్యాపారులతో పాటు ప్రజలకూ ఓదార్పునిచ్చిందన్నారు.
చిన్న పొరపాట్లకే కేసులు నమోదుచేసే సాంప్రదాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పీయూష్ గోయల్ దైర్యం చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా క్రిమినల్ ప్రొవిజన్లలోనూ మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. మేధో సంపత్తి (IP) చట్టాలను ఆధునీకరించడానికి మరియు పేటెంట్లు, ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్‌లకు సంబంధించిన గజిబిజి ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి అనేక సంస్కరణలను చేపట్టినట్లు స్పష్టం చేశారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications