Apps Blocked: భారత్ చైనాకు సంబంధించిన కొన్ని ప్రమాదకరమైన యాప్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది. గతంలోనూ ఇలాంటి యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కూడా చైనా, హాంకాంగ్ కి సంబంధించిన అనేక యాప్స్ బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
తాజాగా భారత్ 119 వీడియో అండ్ వాయిస్ చాయ్ యాప్స్ తొలగించాలని గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించాలని నిర్ణయించింది. అయితే ఇందులో ప్రధానంగా చైనాతో పాటు హాంకాంగ్ కి సంబంధించిన యాప్స్ ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వాలతో పాటు ఇతర సంస్థల కంటెంట్ తొలగింపు అభ్యర్థనలను ట్రాక్ చేసే హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించే సైట్ అయిన లుమెన్ డేటాబేస్ దీనికి సంబంధించిన డేటాను ప్రకటించింది. కానీ వీటిలో ప్రస్తుతం ఇండియాలో కేవలం 15 మాత్రమే బ్లాక్ చేయబడ్డాయి. మిగిలినవి ఇప్పటికీ యూజర్లు డౌన్లోడ్ చేసుకోవటానికి అందుబాటులోనే ఉన్నాయని వెల్లడైంది.

ప్రభావితమైన యాప్‌లు తక్కువ సంఖ్యలో సింగపూర్, యునైటెడ్ స్టేట్స్, యూకే, ఆస్ట్రేలియా నుంచి కూడా ఉన్నట్లు మనీకంట్రోల్ నివేదించింది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69A కింద ఈ ఆదేశాలు జారీ చేయబడింది. జాతీయ భద్రత, సార్వభౌమాధికారం లేదా ప్రజా క్రమం దృష్ట్యా ఆన్‌లైన్ కంటెంట్‌కు ప్రజల ప్రాప్యతను నిరోధించే అధికారాలను ఈ విభాగం కేంద్రానికి ఇస్తుంది. ఈ విభాగం కింద మునుపటి ఆర్డర్‌లు ముఖ్యంగా భారత్, చైనా మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తరువాత చైనీస్ యాప్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి.
గూగుల్ కొన్నియాప్స్ బ్లాక్ చేయటంపై వాటిని నిర్మించిన యాప్ డెవలపర్లు మాట్లాడుతూ ఇప్పటి వరకు తమకు ఇంలాటి చర్యలపై ఎలాంటి ముందస్తు సమాచారం లేదని వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము ఆసక్తిగా ఉన్నామని వారు చెబుతున్నారు. మిగిలిన యాప్‌లపై నిషేధాన్ని అమలు చేయడంలో జాప్యం సాంకేతిక లేదా విధానపరమైన కారణాల వల్ల జరిగిందా అనే విషయంపై టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
అయితే ఈ వ్యవహారంపై భారత ఐటీ మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అలాగే ప్రభావితమైన యాప్ యజమానులు కూడా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించకపోవటం గమనార్హం. ప్రభావితమైన వాటిలో సింగపూర్‌కు చెందిన మాంగోస్టార్ బృందం అభివృద్ధి చేసిన చిల్‌చాట్ యాప్ ఉంది. ఈ యాప్ దాదాపు ఒక మిలియన్ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. యాప్ బ్లాక్ చేసే ప్రమాదంపై గూగుల్ తమకు తెలియజేసినట్లు ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications