జనవరి 23తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. ఆ వారం నిల్వలు 8.053 బిలియన్ డాలర్లు పెరగడంతో.. మొత్తం విదేశీ మారక నిల్వలు 709.413 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం విడుదల చేసిన తాజా డేటా వెల్లడించింది. ఇది భారత్ ఆర్థిక స్థిరత్వానికి కీలకమైన మైలురాయిగా భావిస్తున్నారు. గతంలో నమోదైన గరిష్ట స్థాయి 704.89 బిలియన్ డాలర్లను ఇది క్రాస్ చేసింది. ఈ స్థాయి గత సెప్టెంబర్ 2024లో నమోదైంది.తాజాగా ఈ జనవరి మాసం ఆ రికార్డును బ్రేక్ చేసింది.
ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం.. దేశ విదేశీ మారక నిల్వల్లో అతిపెద్ద వాటాను కలిగి ఉన్న విదేశీ కరెన్సీ ఆస్తులు (FCA) జనవరి 23తో ముగిసిన వారంలో 2.367 బిలియన్ డాలర్లు పెరిగి 562.885 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. డాలర్, యూరో, యెన్ వంటి కరెన్సీల్లో పెట్టుబడుల విలువ పెరగడం దీనికి ప్రధాన కారణంగా పేర్కొనబడింది.

ఇదే సమయంలో, దేశ విదేశీ మారక నిల్వల్లో భాగమైన బంగారం విలువ భారీగా పెరిగింది. ఆ వారం బంగారం నిల్వల విలువ 5.635 బిలియన్ డాలర్లు పెరిగి 123.088 బిలియన్ డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. బంగారం నిల్వలు పెరగడం దేశానికి దీర్ఘకాలిక భద్రతా కవచంలా పనిచేస్తుంది.
ఇక ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (SDRs) విలువ 33 మిలియన్ డాలర్లు పెరిగి 18.737 బిలియన్ డాలర్లకు చేరింది. అలాగే ఐఎంఎఫ్ (IMF) వద్ద భారత రిజర్వ్ పొజిషన్ కూడా 18 మిలియన్ డాలర్లు పెరిగి 4.703 బిలియన్ డాలర్లకు చేరినట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది.
గత వారం కూడా భారత విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగిన విషయం గమనార్హం. ఆ సమయంలో నిల్వలు 14.167 బిలియన్ డాలర్లు పెరిగి 701.360 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వరుసగా రెండు వారాల్లో భారీ పెరుగుదల నమోదు కావడం దేశ బయట ఖాతాల బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇదిలా ఉండగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద రెమిటెన్స్‌లను స్వీకరించే దేశంగా కొనసాగుతోంది. ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం, FY25లో రెమిటెన్స్ ఇన్‌ఫ్లోలు 135.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది దేశ బయట ఖాతాలో స్థిరత్వాన్ని మరింత బలపరిచింది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ.. భారత్‌కు భారీ స్థాయిలో స్థూల పెట్టుబడి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. FY25లో ఈ ప్రవాహాలు GDPలో 18.5 శాతంగా నమోదయ్యాయి. UNCTAD డేటా ప్రకారం.. దక్షిణాసియాలో భారత్ అత్యధికంగా స్థూల FDI ప్రవాహాలను ఆకర్షించిన దేశంగా నిలిచింది. ఇండోనేషియా, వియత్నాం వంటి ప్రధాన ఆసియా దేశాల కంటే ముందంజలో ఉంది.
2024లో గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడి ప్రకటనల్లో భారత్ ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో నిలిచింది. 1,000కు పైగా ప్రాజెక్టులు నమోదు కాగా.. 2020-24 మధ్య గ్రీన్‌ఫీల్డ్ డిజిటల్ పెట్టుబడులలో భారత్ 114 బిలియన్ డాలర్లను ఆకర్షించి ప్రపంచంలోనే అతిపెద్ద గమ్యస్థానంగా అవతరించింది.
2025 ఏప్రిల్-నవంబర్ మధ్య స్థూల FDI ప్రవాహాలు 64.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో ఉన్న 55.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే స్పష్టమైన వృద్ధిని సూచిస్తోంది. ప్రస్తుతం ఉన్న విదేశీ మారక నిల్వలు దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడే స్థాయిలో ఉండటంతో పాటు.. బాహ్య రుణంలో సుమారు 94 శాతం కవర్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన లిక్విడిటీ బఫర్‌గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

GR RBI MPC Poll: ఏప్రిల్‌లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications