food business: ఫుడ్ సర్వీసెస్ కు ఫుల్ డిమాండ్! దేశంలో ఏ ఫుడ్ ఎక్కువగా తింటున్నారంటే..
భారతదేశంలో ఆహార సేవలు (Food Services) రంగం రాబోయే సంవత్సరాల్లో భారీ వృద్ధిని సాధించబోతోందని రిపోర్ట్ లు చెప్తున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy).. విడుదల చేసిన "How India Eats" వార్షిక నివేదిక ప్రకారం, భారత Food Services Market పరిమాణం 2030 నాటికి రూ.125 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం food business మార్కెట్ విలువ 78 బిలియన్ డాలర్లుగా ఉంది.
కారణాలు ఇవే..
భారత Food Services Market వృద్ధికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి:
- పెరుగుతున్న ఆదాయాలు (Rising Incomes): మధ్యతరగతి ఆదాయం పెరుగుతుండటం వల్ల బయట భోజనం చేయడం లేదా ఫుడ్ డెలివరీపై ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతోంది.
- డిజిటల్ అడాప్షన్ (Digital Adoption): స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ వినియోగం పెరగడం వల్ల ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
- సౌలభ్యం (Appetite for Convenience): ప్రస్తుతం పెరుగుతున్న లగ్జరీ లైఫ్ స్టైల్ కు అనుగుణంగా వేగవంతమైన, సౌకర్యవంతమైన ఆహార సేవలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది.

కొత్త పోకడలు
నివేదిక ప్రకారం ఫుడ్ సర్వీస్ బిజినెస్ మెట్రో నగరాలకే పరిమితం కాకుండా.. ఇప్పుడు చిన్న నగరాలకు కూడా విస్తరిస్తోంది. అగ్రశ్రేణి ఎనిమిది నగరాల కంటే ఇతర నగరాల్లో డైనింగ్-అవుట్ వృద్ధి రెండు రెట్లు ఎక్కువగా ఉంది. అలాగే, Food Services Marketలో కొన్ని ప్రత్యేకమైన ధోరణులు కనిపిస్తున్నాయి. అవేంటంటే..
- అర్ధరాత్రి భోజనాలు (Late-Night Meals): రాత్రి 11 గంటల తర్వాత తీసుకునే ఆర్డర్లు డిన్నర్ ఆర్డర్ల కంటే మూడు రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. పిజ్జాలు, కేకులు, శీతల పానీయాలు ఎక్కువగా పెరుగుతున్నాయి.
- ఆరోగ్యకరమైన ఆహారం (Healthy Eating): ఆరోగ్యకరమైన ఆహారం మరియు అధిక ప్రొటీన్ ఉండే భోజనానికి సంబంధించిన ఆర్డర్లు మొత్తం ఆర్డర్ల కంటే 2.3 రెట్లు వేగంగా పెరుగుతున్నాయి.
- ప్రాంతీయ వంటకాల పునరుజ్జీవం (Regional Cuisine): గోవా, బిహారీ మరియు పహారీ వంటి ప్రాంతీయ వంటకాలు ప్రధాన వంటకాల కంటే 2-8 రెట్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
- అంతర్జాతీయ వంటకాలు: కొరియన్ , వియత్నామీస్ , మెక్సికన్ వంటి అంతర్జాతీయ వంటకాలు కూడా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. బోబా టీ, మచ్చా టీ వంటి పానీయాలకు కూడా గిరాకీ విపరీతంగా పెరిగింది.
రాబోయే ఏళ్లలో ఇలా..
food business Market లో రాబోయే కాలంలో మరింత డెవలప్ అవ్వనుంది. రెస్టారెంట్లు తమ మార్కెటింగ్ బడ్జెట్‌లో 75% పైగా డిజిటల్ ఛానెల్‌లలో ఖర్చు చేస్తున్నాయి. ముఖ్యంగా యువ వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. QSRలు (Quick Service Restaurants), క్లౌడ్ కిచెన్‌లు (Cloud Kitchens) 17% కంటే ఎక్కువ CAGRతో వృద్ధి చెందుతాయని, ఇది వ్యవస్థీకృత ఆహార సేవల వృద్ధి కంటే దాదాపు 1.5 రెట్లు ఎక్కువ అని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications