గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 విడుదల.. ఆకలి కేకల్లో ఇండియా పొజిషన్ ఇంత దారుణమా..?
Global hunger index: ప్రపంచ దేశాలకు భిన్నంగా భారత ఆర్థిక వ్యవస్థ జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు తహతహలాడుతోంది. అయితే ఆ మేరకు దేశంలో ఆకలి చావులు తగ్గుతున్నాయా అనే ప్రశ్న సగటు సామాన్యుడిలో ఉత్పన్నమవుతోంది. తాజాగా రిలీజ్ అయిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ డేటా భారత్ అధ్వాన పరిస్థితికి అద్దం పడుతుంది.
భారత్ గురించి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 పలు కీలక అంశాలను ప్రస్తావించింది. 28.7 స్కోర్ సాధించిన ఇండియా.. తీవ్రమైన ఆకలి కోరల్లో చిక్కుకున్నట్లు నివేదించింది. పోషకాహార లోపం రేటు 16.6 శాతం ఉండగా.. ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 3.1 శాతమని పేర్కొంది. ఇక 15-24 వయస్సు కలిగిన మహిళల్లో రక్తహీనత 58.1 శాతంగా ఉన్నట్లు తేల్చింంది. తద్వారా మొత్తం 125 దేశాల్లో ఇండియాకు 111వ ర్యాంక్ ఇచ్చింది.

అయితే కన్సర్న్ వరల్డ్‌వైడ్ మరియు వెల్ట్ హంగర్ హిల్ఫ్, ఐర్లాండ్ మరియు జర్మనీకి చెందిన ప్రభుత్వేతర సంస్థలు విడుదల చేసిన ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023ని భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఇందులో తప్పుడు, లోపభూయిష్ట కొలతలు వినియోగించినట్లు ఆరోపించింది. ఇండియాలోని వాస్తవ పరిస్థితిని నివేదిక ప్రతిబింబించలేదంటూ మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇండెక్స్‌ను లెక్కించే 4 సూచికలలో 3 పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవని భారత్ ఆరోపించింది. కాబట్టి ఇది మొత్తం జనాభాను పరిగణలోనికి తీసుకోలేదని వాదించింది. అయితే పొరుగు దేశాలు పాకిస్తాన్ 102వ స్థానంలో, బంగ్లాదేశ్ 81, నేపాల్ 69, శ్రీలంక 60వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక 2022లో మొత్తం 121 దేశాలతో పోలిస్తే భారత్ 107వ ర్యాంక్‌లో ఉండగా.. ఈ ఏడాది నాలుగు స్థానాలు దిగజారింది.


Click it and Unblock the Notifications