తారాస్థాయికి ఇండియా-కెనడా ఉద్రిక్తతలు.. ఆ షేర్లలో భారీ క్షీణత.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి!
India-Canada tensions: ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత్-కెనడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలను భారత్ నిర్ద్వందంగా తోసిపుచ్చినా.. పదేపదే అవే నిందలు వేస్తూ మన సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.
దౌత్య సంబంధాలు తీవ్రంగా క్షీణించిన ప్రస్తుత సమయంలో.. ఇరుదేశ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్(CPPIB), కెనడా పెన్షన్ ప్లాన్(CPP)లు మన మార్కెట్లలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాయి. అక్కో, జొమాటో, కోటక్ మహీంద్రాబ్యాంక్, ICICI బ్యాంక్ సహా IT దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో వంటి పలు భారతీయ సంస్థల్లో ఇన్వెస్ట్ చేశాయి.

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనతో CPPIB హోల్డ్ చేస్తున్న స్టాక్స్ వాల్యూ ఇప్పటికే దెబ్బతింది. ఇండియన్ మార్కెట్లలో మొత్తం21 బిలియన్ డాలర్లు తాము పెట్టుబడిపెట్టినట్లు ఏడాది క్రితమే CPPIB నివేదించింది. దీంతో అది ఇన్వెస్ట్ చేసిన ఇండస్ టవర్స్, నైకా, జొమాటో, పేటీఎం, డెల్లివరీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
జూన్ 2023 నాటికి CPPIB జొమాటోలో 20.35 కోట్ల ఈక్విటీ షేర్లు(2.37% వాటా) కలిగి ఉంది. వీటితో పాటు 4.3 కోట్ల డెల్లివెరీ షేర్లు(6% వాటా), ఇండస్ టవర్స్‌లో 2.18 శాతం, వన్ 97 కమ్యూనికేషన్స్(పేటీఎం)లో 1.76 శాతం, FSN ఇ-కామర్స్ వెంచర్స్‌లో 1.47 శాతం వాటాను హోల్డ్ చేస్తోంది. ఈ దుమారానికి తోడు ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA)పై చర్చలు నిలిచిపోవడమూ మరింత ఆందోళన కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications