గత కొంతకాలంగా విదేశాల్లో నివసించే భారతీయులను (NRIs), ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉండేవారిని వేధిస్తున్న ఒక ప్రధాన సమస్యకు భారత ప్రభుత్వం స్వస్తి పలికింది. కేంద్ర బడ్జెట్ 2026లో భాగంగా బంగారం కస్టమ్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

విదేశాల నుండి భారతదేశానికి వచ్చే ప్రయాణికులకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. 2026 కేంద్ర బడ్జెట్ లో బంగారంపై ఉన్న పాత కస్టమ్స్ నిబంధనలను సవరించి, సామాన్యులకు ఎంతో ఊరటనిచ్చింది. ఈ మార్పు వల్ల ఎయిర్‌పోర్టుల్లో తనిఖీల సమయంలో ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులు ఇకపై ఉండవని భావిస్తున్నారు.
పాత నిబంధనలు ఏమిటి?
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. మహిళలు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారాన్ని డ్యూటీ ఫ్రీగా (సుంకం లేకుండా) తీసుకురావచ్చు. అయితే ఇక్కడే ఒక మెలిక ఉండేది. ఈ బరువుతో పాటు విలువపై కూడా పరిమితి ఉండేది. పాత రూల్ ప్రకారం మహిళలకు 1 లక్ష రూపాయలు, పురుషులకు 50 వేల రూపాయల వరకు మాత్రమే విలువ ఉండాలి. అంతకుమించి వాల్యూ ఉన్న బంగారాన్ని తీసుకురావాడానికి లేదు. అయితే బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో 20 గ్రాముల బంగారం విలువ కూడా 50 వేల కంటే ఎంతో ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల ప్రయాణికులు తమ వద్ద ఉన్న నిర్ణీత బరువులోపు బంగారం ఉన్నా.. దాని విలువ పెరిగిపోవడంతో భారీగా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది.
కొత్త మార్పుతో కలిగే ప్రయోజనం
తాజా బడ్జెట్ నిర్ణయం ప్రకారం.. ప్రభుత్వం వాల్యూ క్యాప్ (Value Cap) ని పూర్తిగా ఎత్తివేసింది. ఇకపై కేవలం బరువును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అంటే మహిళలు 40 గ్రాములు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారాన్ని ఎటువంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకురావచ్చు. దీని విలువ ఎంత ఉన్నా సంబంధం లేదు. ఈ నిర్ణయం వల్ల ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులను అనవసరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తప్పుతుందని యూఏఈలోని ప్రవాస భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
NRIల పోరాటం ఫలించింది
ఈ మార్పు వెనుక యూఏఈలోని అనేక ఎన్ఆర్ఐ (NRI) సంఘాల కృషి ఉంది. ఇండియన్ అసోసియేషన్ షార్జా వంటి సంస్థలు గత సెప్టెంబర్ లోనే ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశాయి. పాత నిబంధనల వల్ల సాధారణ కార్మికులు కూడా ఎయిర్‌పోర్టుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని అక్రమ రవాణాదారులలా చూడటం సరికాదని ఫిర్యాదు చేశారు. చివరకు ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవడంతో గల్ఫ్ దేశాల్లోని భారతీయ సమాజం కృతజ్ఞతలు తెలుపుతోంది.
ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో ఇంటికి వెళ్లే వారికి ఇది పెద్ద వరం. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కొంచెం కొంచెం బంగారం కొని దాచుకునే సాధారణ ఉద్యోగులకు ఈ నిర్ణయం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. బంగారం ధరలు పెరిగిన ప్రతిసారీ కస్టమ్స్ రూల్స్ మారుతాయేమో అన్న భయం ఇక ఉండదు.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Gold price Today: భగభగమంటున్న పసిడి.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే?

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..



Click it and Unblock the Notifications