నీట్ ఎగ్జామ్ ఎఫెక్ట్: ఇండియాలో టెలిగ్రామ్ బ్లాక్.. అసలు ఏం జరిగిందంటే?
నీట్ (NEET 2026) రీ-ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. పాపులర్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) ను ఇండియాలో తాత్కాలికంగా బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ జరగబోతోంది. ఈ తరుణంలో ఎలాంటి పేపర్ లీకులు, మోసాలు జరగకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. జూన్ 22 వరకు ఈ బ్లాక్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

మెసేజ్ ఎడిట్ ఫీచర్‌పై నజర్
నిజానికి టెలిగ్రామ్‌ను కేవలం బ్లాక్ చేయడమే కాదు.. మరో షాకింగ్ రూల్ కూడా పెట్టారు. టెలిగ్రామ్‌లో ఉండే 'మెసేజ్ ఎడిటింగ్' ఫీచర్‌ను జూన్ 30 వరకు ఇండియాలో డిసేబుల్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఎందుకంటే, గతంలో చాలామంది కేటుగాళ్లు ఈ ఫీచర్‌ను అడ్డుపెట్టుకుని పెద్ద మోసాలకు పాల్పడ్డారట. పాత మెసేజ్‌లను ఎడిట్ చేసి, పిడిఎఫ్ (PDF) ఫైళ్లను మార్చేసి, "చూశారా.. పరీక్షకు ముందే మాకు పేపర్ లీక్ అయింది" అంటూ తప్పుడు టైమ్‌స్టాంప్‌లతో ఫేక్ ప్రచారాలు చేశారట. దీనివల్ల అమాయక స్టూడెంట్స్ తప్పుదోవ పడుతున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గుర్తించింది.
చీటింగ్ రాకెట్లకు చెక్
టెలిగ్రామ్‌లో కొన్ని ముఠాలు ఆర్గనైజ్డ్‌గా చీటింగ్ రాకెట్ నడుపుతున్నట్లు ఎన్‌టిఏ గమనించింది. "PAPER LEAKED NEET", "Re-NEET 2026", "Private Mafia" లాంటి పేర్లతో గ్రూపులు, ఛానళ్లు క్రియేట్ చేసి.. స్టూడెంట్స్‌ను బురిడీ కొట్టిస్తున్నారట. "మా దగ్గర నీట్ క్వశ్చన్ పేపర్ ఉంది.. మీకు కావాలంటే కొన్ని వేల నుండి లక్షల రూపాయలు ఇవ్వాలి" అంటూ అమాయక అభ్యర్థుల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలింది.
ఇప్పటికే పోలీసులు, సైబర్ క్రైమ్ టీమ్స్ రంగంలోకి దిగి చాలా ఛానళ్లను, బాట్లను డిలీట్ చేయించారు. కానీ, గ్రూపులు డిలీట్ చేస్తున్నా కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీనికి రూట్ లెవెల్లో చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే డైరెక్ట్‌గా ప్లాట్‌ఫామ్‌నే బ్లాక్ చేయాల్సి వచ్చింది.
యూజర్లకు ఇబ్బందే.. కానీ తప్పదు!
ఈ నిర్ణయం వల్ల ఇండియాలో ఉన్న లక్షలాది మంది రెగ్యులర్ టెలిగ్రామ్ (Telegram) యూజర్లకు ఇబ్బంది కలుగుతుందనే విషయం ప్రభుత్వానికి తెలుసు. కానీ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ పారదర్శకతను కాపాడటం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం అన్నిటికంటే ముఖ్యం కాబట్టి ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకోక తప్పలేదని NTA వెల్లడించింది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరూ ఫేక్ లీక్ వార్తలను నమ్మి మోసపోవద్దని, ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలని అధికారులు కోరుతున్నారు.
విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి!
ఈ డిజిటల్ కాలంలో ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా వచ్చే లీక్ వార్తలను నమ్మి విద్యార్థులు తమ విలువైన సమయాన్ని, డబ్బును వృధా చేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరీక్షలకు కష్టపడి చదవడంపైనే శ్రద్ధ పెట్టాలని, ఎలాంటి అడ్డదారులు తొక్కకూడదని సూచిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో టెలిగ్రామ్ బ్యాన్ గురించిన చర్చ జోరుగా సాగుతోంది. ఈ తాత్కాలిక ఇబ్బంది కేవలం పరీక్షల పారదర్శకత కోసమే కాబట్టి, జూన్ 22 తర్వాత మళ్లీ యాప్ యథావిధిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications