Crypto News: బ్యాడ్‌న్యూస్.. క్రిప్టోలపై విరుచుకుపడ్డ భారత ప్రభుత్వం.. పూర్తి వివరాలు..
Crypto Exchanges: క్రిప్టోల్లో భారీ నష్టాలు పొందే ప్రమాదం ఉన్నప్పటికీ చాలా మంది వాటిని విడిచిపెట్టడం లేదు. అయితే భారత ప్రభుత్వం మాత్రం వీటిని ప్రోత్సహించే ఉద్ధేశ్యంలో అస్సలు లేదు.
ఈ క్రమంలో బినాన్స్, కుకోయిన్, ఓకెఎక్స్‌తో సహా మెుత్తం 9 విదేశీ క్రిప్టో ఎక్స్ఛేంజీలు, వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీసెస్ ప్రొవైడర్ల కోసం వెబ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను భారత్ బ్లాక్ చేసింది. ఈ సంస్థలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(FIU) ఇచ్చిన షోకాజ్ నోటీసులను పాటించకపోవటంతో తాజా పరిణామం వచ్చింది. ఈ వారం ప్రారంభంలో ఆపిల్ తన యాప్ స్టోర్ నుంచి బినాన్స్, కుకోయిన్, ఓకేఎక్స్ వంటి ఆఫ్‌షోర్ క్రిప్టో ఎక్స్ఛేంజీలను తొలగించింది.

వాస్తవానికి ఈ క్రిప్టో ఎక్సేంజీ సంస్థలు భారత మనీలాండరింగ్ చట్టాలను పాటించనందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి షోకాస్ నోటీసులు వచ్చాయి. త్వరలోనే ఈ యాప్‌ల ఆండ్రాయిడ్ వెర్షన్‌లు కూడా తీసివేయబడే అవకాశం ఉందని నేషనల్ డైలీ నివేదించింది. డిసెంబర్ 28, 2023న ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ భారతదేశంలోని సదరు సంస్థల వ్యాపార కార్యకలాపాల గురించి వివరణ కోరింది. ఈ క్రమంలో వారి అనధికార కార్యకలాపాల గురించి, మనీలాండరింగ్ నిరోధానికి సంబంధించి చట్టాలను పాటించకపోవడం గురించి ఆందోళనలను హైలైట్ చేసింది.
వీటిపై స్పందించేందుకు FIU ఇచ్చిన రెండువారాల గడువు నిన్నటితో ముగియటంతో ప్లాట్‌ఫారమ్‌ల యూనిఫాం రిసోర్స్ లొకేటర్(URL)కి యాక్సెస్‌ను బ్లాక్ చేయాలని FIU కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. ఒక నివేదిక ప్రకారం గ్లోబల్ క్రిప్టో ఎక్స్ఛేంజీలు భారతదేశంలో రిజిస్టర్డ్ ఎంటిటీని కలిగి లేనందున కేంద్ర ఖజానాకు ఏడాదికి దాదాపు రూ.3,000 కోట్ల పన్ను నష్టాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications