ఢిల్లీ vs బెంగళూరు vs హైదరాబాద్.. వీటిలో బెస్ట్ కోవర్కింగ్ ప్లేస్ ఏది? షాకింగ్ రిపోర్ట్!
మనదేశంలో వరల్డ్ క్లాస్ సిటీలు చాలానే ఉన్నాయి. అయితే వీటిలో బెస్ట్ కోవర్కింగ్ ప్లేస్ ఏది? అన్న డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా..? ఈ విషయంపైనే తాజాగా ఒక రీసెర్చ్ జరిగింది. ఇండియా ఫ్లెక్స్ పల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశంలోని బెస్ట్ కోవర్కింగ్ ప్లేస్ ఏదో తెలిసిపోయింది. ఈ రేసులో నిజమైన ఛాంపియన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని బెస్ట్ కోవర్కింగ్ ప్లేస్ రేసు(best coworking space)లో బెంగళూరు ముందుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. నిజానికి ఇప్పుడు ఎవరు ముందున్నారు అనేదానికంటే, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు ఏ నగరం తమ ఆఫీస్ ఎకోసిస్టమ్‌ను రెడీ చేస్తోంది అనేదే ముఖ్యం అంటున్నారు నిపుణులు. అయితే ప్రస్తుతానికి బెంగళూరు అగ్రస్థానంలో ఉన్నా.. ఢిల్లీ-ఎన్‌సిఆర్, హైదరాబాద్ నగరాలు చాలా వేగంగా తమ ఎకో సిస్టమ్స్ ను మార్చుకుంటున్నాయి. ఈ మూడు నగరాలు వర్కింగ్ స్పేస్ విషయంలో మూడు భిన్నమైన స్ట్రాటజీలతో ఉన్నాయి.

మూడు సిటీలు మూడు రకాలుగా..
- బెంగళూరు: బెంగళూరులోని వర్క్స స్పేస్ .. మెచ్యూరిటీ, క్వాలిటీతో కూడుకున్నదై ఉంటుందని స్టడీల్లో తేలింది.
- ఢిల్లీ-ఎన్‌సిఆర్: ఢిల్లీలీ వర్క్ స్పేస్ కంప్లయెన్స్ అండ్ గవర్నెన్స్ తో కూడుకుని ఉంటుదట. అంటే కట్టుబాట్లతో పాటు మెరుగైన గవర్నె్న్స్ ఉంటుందన్న మాట.
- హైదరాబాద్: ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. ఇక్కడి వర్క్ స్పేస్ వేగం, విస్తరణపై ఎక్కువ ఫోకస్ పెట్టింది.
నంబర్స్ ఏం చెబుతున్నాయి?
ఇండియా ఫ్లెక్స్ పల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం బెంగళూరులో ఫ్లెక్స్ ఆఫీస్ సెంటర్లు 799 ఉన్నాయి. ఈ సిటీ ఎక్కువగా స్టార్టప్స్ కు హబ్ గా ఉంది. హైదరాబాద్ లో ఫ్లెక్స్ సెంటర్లు 304 ఉండగా.. ఇక్కడ అత్యంత వేగంగా వర్క్ స్పేస్ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇక ఢిల్లీలో 235 ఫ్లెక్స్ సెంటర్స్ ఉండగా.. ఇది చాలా కంపెనీలకు గవర్నెన్స్ సెంటర్ గా ఉంది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే..
ఈ స్టడీని బట్టి చూస్తే ఈ రేస్ లో ఒక్క నగరం మాత్రమే పూర్తిగా పైచేయి సాధించలేదని అర్థమవుతోంది. ప్రతి నగరానికీ దానిదైన బలమైన పట్టు ఉంది. ఒక కంపెనీ మొదలుపెట్టడానికి బెంగళూరు బెస్ట్ ఆప్షన్ గా ఉంటే దాన్ని వేగంగా విస్తరించడానికి హైదరాబాద్ సరైన ప్లేస్ గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా కంపెనీ విస్తరించాక హెడ్ క్వార్టర్స్ గా ఎంచుకునేందుకు ఢిల్లీ సరైన ఆప్షన్ గా ఉంది.
బెంగళూరు: క్వాలిటీ వర్క్ ప్లేస్
బెంగళూరు ఎప్పుడూ టెక్నాలజీకి, గ్లోబల్ కార్యకలాపాలకు ఒక గ్లోబల్ బేస్. అందుకే ఇక్కడి ఆఫీస్ స్పేస్‌లు కూడా ప్రపంచ స్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ ఎక్కువగా ఎక్కువగా గ్రేడ్ A, A+ ఆఫీస్ స్పేస్‌లే కనిపిస్తాయి. ఇక్కడి ఆఫీస్ లను తాత్కాలిక అవసరంలా చూడరు. పెద్ద కంపెనీలు తమ దీర్ఘకాలిక రియల్ ఎస్టేట్ ప్లాన్‌లో దీనిని ఒక ముఖ్యమైన భాగంగా చూస్తాయి.
ఢిల్లీ: బెస్ట్ ఫర్ బోర్డురూమ్స్
ఢిల్లీ-ఎన్‌సిఆర్ మార్కెట్ ముఖ్యంగా గవర్నెన్స్ స్పేస్ కు కీలకంగా మారింది. ఇక్కడ కంపెనీల్లో ఆపరేషన్స్ కంటే బోర్డ్ రూమ్ నిర్ణయాలు ఎక్కువ జరుగుతాయి. చాలా కంపెనీలు తమ హెడ్ క్వార్టర్స్ ను ఇక్కడ ఏర్పరచుకున్నాయి. ఇక్కడి నుంచి తమ బ్రాంచ్ లను రన్ చేస్తుంటాయి. కాబట్టి ఈ ప్లేస్ కు తనదైన డిమాండ్ ఉంది.
హైదరాబాద్: స్పీడ్ అండ్ స్కేల్
హైదరాబాద్ సిటీలో దేశంలోని ఇతర మెట్రో సిటీల కంటే వేంగా డెవలప్ అవుతోంది. గ్రేడ్ A ఆఫీస్ స్పేస్ల లు అధికంగా అందుబాటులో ఉండటం ఎక్కువ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాయి. ఇక్కడ తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి ఆఫీసులు నిర్మించొచ్చు. ఇదే ఈ సిటీకి ప్లస్ పాయింట్.
ఫ్యూచర్ లో ఇలా..
నిపుణులు అంచనా ప్రకారం ఈ మూడు సిటీలు ఫ్యూచర్ లో కూడా ఇదే స్టైల్ లో ముందుకెళ్లే అవకాశం ఉంది. అంటే బెంగళూరు ఎప్పటికీ క్వాలిటీకి ప్రమాణంగా నిలుస్తుంది. ఢిల్లీ గవర్నెన్స్ కు నాయకత్వం వహిస్తుంది. ఇక హైదరాబాద్ ప్రీమియం క్వాలిటీని బ్యాలెన్స్ చేస్తూ వేగంగా వృద్ధి చెందే కేంద్రంగా మారుతుంది.


Click it and Unblock the Notifications