G20 Summit 2023: ప్రధాన మోడీ, బంగ్లాదేశ్ కౌంటర్ షేక్ హసీనా సెప్టెంబర్ 8న ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ క్రమంలో రెండు దేశాలు మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఇందులో ప్రధానంగా డిజిటల్ చెల్లింపులకు సహకారం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారత చెల్లింపుల వ్యవస్థ విజయం సాధించిన తరుణంలో బంగ్లాదేశ్ ఆసక్తిని కనబరిచిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ చెల్లింపు విధానంలో సహకారంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), బంగ్లాదేశ్ బ్యాంక్ మధ్య ఎంవోయూ జరిగినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అలాగే రెండవ అవగాహన ఒప్పందం 2023-25 నాటికి భారత్-బంగ్లా మధ్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం పునరుద్ధరణపై జరిగింది. ఇక చివరి ఎంవోయూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ICAR).. బంగ్లాదేశ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్(BARC) మధ్య జరిగింది.
భద్రతా సహకారం, సరిహద్దు నిర్వహణ, వాణిజ్యం కనెక్టివిటీ, నీటి వనరులు, ఎనర్జీ, అభివృద్ధి సహకారం, సాంస్కృతిక ప్రజల మధ్య సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ పేర్కొంది.

అగర్తల-అఖౌరా రైలు లింక్, మైత్రి పవర్ ప్లాంట్ యూనిట్-II, ఖుల్నా-మొంగ్లా రైలు లింక్ తర్వాత తగిన తేదీలో జరిగే ప్రాజెక్టుల ఉమ్మడి ప్రారంభోత్సవం కోసం ఇరు దేశాల ప్రధానులు ఎదురుచూస్తున్నట్లు నివేదించబడింది.


Click it and Unblock the Notifications