ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో అడాప్షన్ విషయంలో ఆసియా దేశాలు ముందు నిలుస్తున్నాయి. ఆసియాలో చైనాను మినహాయించి ఇతర దేశాలు క్రిప్టో మార్కెట్ విషయంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోని దేశాలు క్రిప్టో ప్రపంచంలో ఆసియా దేశాల కంటే కాస్త వెనుకే ఉన్నాయి. క్రిప్టో అడాప్షన్ విషయంలో టాప్ 10లో నిలిచిన ఆసియా దేశాల్లో భారత్ కూడా ఉంది. ఈ మేరకు భారత్ సహా వివిధ దేశాల్లో క్రిప్టో కరెన్సీ కలిగి ఉన్న వారికి సంబంధించి సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 30 శాతం మంది తమ వద్ద క్రిప్టో కరెన్సీ ఉందని తెలిపారు. భారత్ టాప్ 5లో ఉంది. ముఖ్యంగా 18 ఏళ్ల నుండి 34 ఏళ్ల వయస్సు కలిగిన వారు క్రిప్టో వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ రీసెర్చ్ ఫర్మ్ పైండర్ క్రిప్టో కరెన్సీపై సర్వే నిర్వహించింది. ఆసియా దేశాల్లో జరిగిన ఈ సర్వేలో భారత్ మూడో స్థానంలో ఉంది.
వివిధ దేశాల్లో క్రిప్టో కరెన్సీ కలిగి ఉన్నవారు...
ప్రపంచంలోనే క్రిప్టో కరెన్సీ అడాప్షన్‌లో ఆసియా ముందు నిలిచింది. ఈ సర్వేలో పాల్గొన్న ఆసియాలోని వివిధ దేశాల వారు తమ వద్ద క్రిప్టో కరెన్సీ ఉందని చెప్పారు. ఈ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 30 శాతం మంది తమ వద్ద క్రిప్టో కరెన్సీ ఉందని తెలిపారు. ఇతర పెట్టుబడులు ఉన్నట్లు 70 శాతం మంది తెలిపారు. క్రిప్టో కరెన్సీని ఎక్కువగా కలిగి ఉన్నదేశాల్లో వియత్నాం వాసులు ముందు ఉన్నారు. ఇక్కడ 41 శాతం మంది క్రిప్టోను కలిగి ఉన్నట్లు చెప్పగా, 59 శాతం మంది ఇతర పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. హాంగ్‌కాంగ్‌లో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 30 శాతం మంది, ఇతర పెట్టుబడులు కలిగిన వారు 70 శాతం మంది, భారత్‌లో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 30 శాతం మంది, ఇతర పెట్టుబడులు కలిగిన వారు 70 శాతం మంది, మలేషియాలో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 29 శాతం మంది, ఇతర పెట్టుబడులు కలిగిన వారు 71 శాతం మంది, పిలిప్పీన్స్‌లో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 28 శాతం మంది, ఇతర పెట్టుబడులు కలిగిన వారు 77 శాతం మంది, బెల్జియంలో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 26 శాతం మంది, ఇతర పెట్టుబడులు కలిగిన వారు 74 శాతం మంది, హాంగ్‌కాంగ్‌లో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 26 శాతం మంది, ఇతర పెట్టుబడులు కలిగిన వారు 74 శాతం మంది, దక్షిణ కొరియాలో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 23 శాతం మంది, ఇతర పెట్టుబడులు కలిగిన వారు 77 శాతం మంది, బ్రెజిల్‌లో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 22 శాతం మంది, ఇతర పెట్టుబడులు కలిగిన వారు 78 శాతం మంది, ఇటలీలో క్రిప్టో కరెన్సీ కలిగిన వారు 21 శాతం మంది, ఇతర పెట్టుబడులు కలిగిన వారు 79 శాతం మంది ఇతర పెట్టుబడులు కలిగి ఉన్నారు.

క్రిప్టో కరెన్సీని అత్యధికంగా కలిగి ఉన్న దేశాల్లో వియత్నం ముందుండగా, ఆ తర్వాత వరుసగా ఇండోనేషియా, ఇండియా, మలేషియా, పిలిప్పీన్స్ ఉన్నాయి. అగ్రరాజ్యాలుగా వెలుగొందుతున్న అమెరికా, యూకేల్లో ప్రజలు క్రిప్టోను తక్కువ స్థాయిలో కలిగి ఉన్నారు. అమెరికాలో 8 శాతం మంది, యూకేలో 9 శాతం మంది క్రిప్టోను కలిగి ఉన్నారు. ఈ కంపెనీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 47,000 మందిని సర్వే చేసింది.
క్రిప్టోను ఎక్కువగా కలిగి ఉన్న వారిలో 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల వారు ఉన్నారు. ఈ వయస్సులోని వారి వద్దనే 40 శాతం క్రిప్టో కరెన్సీ ఉంది. 5-44 ఏళ్ల వయస్సు కలిగిన వారు 20 శాతం మంది, 45-54 ఏళ్ల వయస్సు కలిగిన వారు 17 శాతం మంది క్రిప్టోను కలిగి ఉన్నారు. కొలంబియా, నెదర్లాండ్స్ దేశాల్లో ఎక్కువగా పెద్ద వయస్సు వారు కలిగి ఉన్నారు.
భారత్‌లోని చిన్న నగరాల్లోకి కూడా క్రిప్టో కరెన్సీ క్రమంగా చొచ్చుకు పోతోంది. భారత్‌కు చెందిన అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ వాజీర్ఎక్స్ టైర్ 2, టైర్ నగరాల్లో ఇటీవల 2,648 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ టాప్ క్రిప్టో ఎక్స్చేంజీ 7.3 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. 2021లోనే 21.8 బిలియన్ డాలర్ల ట్రేడింగ్ వ్యాల్యూను కలిగి ఉంది. టైర్ 1 నగరాల్లోను 2375 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది.
నేటి క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ
క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ 50,000 డాలర్ల దిశగా సాగుతోంది. నేడు 1.43 శాతం లాభపడిన క్రిప్టో 47,476 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
- Bitcoin - ధర $47,476.83 - 1.43 శాతం వృద్ధి
- Ethereum - ధర $3,271.52 - 0.83 శాతం వృద్ధి
- Binance Coin - ధర $412.32 - 2.22 శాతం వృద్ధి
- Tether - ధర $1.00 - 0.02 శాతం వృద్ధి
- Cardano - ధర $2.13 - 0.47 శాతం వృద్ధి
- Dogecoin - ధర $0.33 - 12.69 శాతం వృద్ధి
- XRP - ధర $0.02 - 3.18 శాతం వృద్ధి
- Polkadot - ధర $23.03 - 2.13 శాతం వృద్ధి
- USD Coin - ధర $0.99 - 0.03 శాతం వృద్ధి
- Uniswap - ధర $29.92 - 0.93 శాతం వృద్ధి
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications