India-America Trade War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద సుంకాల దాడి చేస్తున్న సంగతి విదితమే. అంతే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు భారతదేశాన్ని 'టారిఫ్ కింగ్' అంటూ పిలిచిన ట్రంప్.. మరికొన్నిసార్లు 'డెడ్ ఎకానమీ' అంటూ విమర్శలు గుప్పించారు. అయినా సరే రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు బలంగానే ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 131.84 బిలియన్ల డాలర్లకు చేరింది. ఇందులో భారత్ 86.51 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు అమెరికాకు ఎగుమతి చేయగా..45.33 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు దిగుమతి చేసుకుంది. భారతదేశం చేసిన ఎగుమతుల్లో ఔషధాలు, రత్నాలు, ఆభరణాలు, ఐటీ ఉత్పత్తులు ఉంటే, దిగుమతులు చేసుకున్న వాటిలో ముడి చమురు, బొగ్గు, విమాన భాగాలు ఉన్నాయి.
అయితే ట్రంప్ కొత్తగా ప్రకటించిన 50 శాతం సుంకాలు విషయానికి వస్తే.. అందులో 25 అదనపు జరిమానాలు ఉన్నాయి. ఇవి భారత ఎగుమతులకు పెద్ద అడ్డంకి కావచ్చు. ముఖ్యంగా ఆయన తరచూ భారత్ రష్యాతో చమురు, ఆయుధాల వ్యాపారం చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితిలో భారత్ కూడా ప్రతీకారం తీర్చుకువాలనుకుంటే ఈ అమెరికన్ కంపెనీలు పెద్ద ప్రమాదంలో పడతాయి. ఈ టాప్ కంపెనీలకు పరిమితులుతో పాటు సుంకాలు విధిస్తే ఆ కంపెనీలకే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా అది గట్టి షాక్ అవుతుంది.

ఇంకా చెప్పాలంటే..అమెరికన్ కంపెనీలు భారత మార్కెట్‌లో ప్రతి రంగంలో గట్టిగా పాతుకుపోయాయి. ఈ-కామర్స్ నుంచి ఫాస్ట్ ఫుడ్, సాంకేతికత నుంచి బ్యాంకింగ్ వరకు అన్నింటిలో ఆ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అమెజాన్ ఇండియా ఇప్పటికే దేశంలోని 97 శాతం పిన్‌కోడ్లను చేరుకుని దాదాపు ప్రతి ఇంటికి యాక్సెస్ సాధించింది. ఇక ఆపిల్ భారతదేశాన్ని ఐఫోన్‌ల కోసం వేగంగా పెరుగుతున్న మార్కెట్‌గా మలుచుకుంది.
టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ డేటా సెంటర్లు, క్లౌడ్ సేవలు, సాఫ్ట్‌వేర్ లైసెన్సింగ్ ద్వారా విస్తారమైన ఆదాయం భారత్ నుంచి సంపాదిస్తున్నాయి.సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ (X) వంటి ప్లాట్‌ఫామ్‌లు కోట్లాది భారతీయుల రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. భారత్ వీటికి ఏదైనా పరిమితి విధిస్తే.. నేరుగా ప్రకటనల ఆదాయంపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
FMCG రంగం విషయానికి వస్తే.. కోకా-కోలా, పెప్సికో, ప్రాక్టర్ & గాంబిల్, కోల్గేట్, జాన్సన్ & జాన్సన్ వంటి అమెరికన్ బ్రాండ్లు పానీయాలు, స్నాక్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, హైజీన్ వస్తువులలో ఆధిపత్యం చూపుతున్నాయి. మాగీ, నెస్కేఫ్, కిట్‌క్యాట్‌లను తయారు చేసే నెస్లే, హగ్గీస్ డైపర్లను ఉత్పత్తి చేసే కింబర్లీ-క్లార్క్, కార్న్‌ఫ్లేక్స్ కోసం ప్రసిద్ధి చెందిన కెల్లాగ్, స్నికర్స్ చాక్లెట్‌ను అందించే మార్స్, క్యాడ్‌బరీ డైరీ మిల్క్ తయారీదారు మోండేలెజ్.. వీటిపై భారత్ కొరడా ఝళిపిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం.
దీంతో పాటుగా ఫాస్ట్ ఫుడ్ రంగం మరింత ప్రభావితం అవుతుంది. మెక్‌డొనాల్డ్స్, KFC, డొమినోస్ పిజ్జా, పిజ్జా హట్, స్టార్‌బక్స్ వంటి బ్రాండ్లు భారత యువతకు ఇష్టమైన ఫుడ్ చైన్లు. వీటి సరఫరా గొలుసు, ముడి పదార్థాల దిగుమతులపై పరిమితులు విధిస్తే..అమెరికా వ్యాపార మోడల్ కుప్పకూలిపోతుంది.
ఇక ఫ్యాషన్ విభాగంలో ఫ్యాషన్, స్పోర్ట్స్, ఆక్సెసరీస్ రంగాల్లో అమెరికన్ కంపెనీలే టాప్ ప్లేయర్స్ గా ఉన్నాయి. ఫారెవర్ 21, మేబెల్లిన్, టైమెక్స్, ఫాసిల్, నైక్, లీవైస్, స్కెచర్స్, గ్యాప్, గెస్ వంటి బ్రాండ్లు పట్టణ వినియోగదారుల్లో విస్తృతంగా ఉన్నాయి. ఈ బ్రాండ్ల ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెరిగితే.. భారత మార్కెట్‌లో వీటి అమ్మకాలు తగ్గిపోవచ్చు. తద్వారా అమెరికా వాణిజ్య పరంగా తీవ్ర కష్టాలును ఎదుర్కోవచ్చు.
ఇక బ్యాంకింగ్ రంగంలో సిటీ గ్రూప్ వంటి అమెరికన్ ఆర్థిక దిగ్గజాలు కోట్లాది క్రెడిట్ కార్డ్ కస్టమర్లను కలిగి ఉన్నాయి. వీటిపై నియంత్రణలు లేదా పరిమితులు విధిస్తే, నేరుగా అమెరికన్ ఫైనాన్స్ రంగానికి దెబ్బ తగులుతుంది.
ఏది ఏమైనా.. డొనాల్డ్ ట్రంప్ విధించే సుంకాలు భారత్‌కు సవాలు అయితే.. భారత్ తీసుకునే ప్రతీకార చర్యలు అమెరికా కార్పొరేట్ దిగ్గజాలకు ఆర్థికపరమైన నష్టాలను తీసుకువస్తాయి. భారత మార్కెట్‌లో వీటికున్న డిమాండ్ దృష్ట్యా..ఈ కంపెనీలు ఎదుర్కొనే నష్టాలు వేల కోట్ల డాలర్లుగా ఉండవచ్చు. ఈ వాణిజ్య యుద్ధంలో గెలుపు ఓటములు కంటే, ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలే బలంగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు.. హార్ముజ్ జలసంధి రవాణాపై ట్రంప్‌కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

మోదీ ఒక్క ఫోన్ చేస్తే చాలు.. ఇరాన్ యుద్దం క్షణాల్లో ఆగిపోతుంది.. యూఏఈ రాయబారి కీలక వ్యాఖ్యలు..

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..



Click it and Unblock the Notifications