కంపెనీలో స్వతంత్ర (ఇండిపెండెట్) డైరెక్టర్ పదవి ఇస్తామంటే గంతులేసుకుంటే వెళ్లే వాళ్ళు ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఆ పదవి ఇస్తామని బ్రతిమిలాడినా మాకు వద్దు బాబు ఆ పదవి అంటూ దూరం జరుగుతున్నారు అనేక మంది. ఒకప్పుడు బెల్లం మాదిరిగా ఉన్న ఈ పదవి ఇప్పుడు చేదులా మారిపోయింది. కోరి కోరి కష్టాలను తెచ్చి పెట్టుకోవడం ఎందుకు అని చాలా మంది ఇండిపెండెట్ డైరెక్టర్ పదవి ఇస్తామని చెబుతున్నా నో చెబుతున్నారు. ఇందుకు గట్టి కారణాలే ఉంటున్నాయి. అవేమిటంటే...

కంపెనీల్లో వెలుగు చూస్తున్న సంఘటనలే...
* కొత్త కంపెనీల చట్టం అమలు నేపథ్యంలో కంపెనీ బోర్డు లోని ఇండిపెండెంట్ డైరెక్టర్ల బాధ్యతలు మరింతగా పెరిగాయి. ఇంతకు ముందు మాదిరిగా బోర్డు సమావేశానికి వెళ్ళామా.. వచ్చామా.. సంతకం పెట్టామా.. వేతనం పొందామా అన్నట్టుగా కాకుండా కంపెనీ కార్యకలాపాలకు భాద్యులుగా మారాల్సి వస్తోంది.
* ఈ మధ్యకాలంలో కంపెనీల్లో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు అప్పులు తీసుకుంటూ ఎగవేస్తుంటే.. మరికొన్ని కంపెనీల ప్రమోటర్లు మోసపూరిత వ్యాపార కార్యకలాపాలు చేపడుతున్నారు.
* కొంత మంది బ్యాంకులకే అప్పులు ఎగవేసి విదేశాలకు పారిపోతున్నారు. కొన్ని కంపెనీల లావాదేవీల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటివి వెలుగుచూసిన సందర్భంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లు కూడా బాధ్యులుగా మారుతున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలు తీసుకునే చర్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వారి పరువు పోతోంది. భవిష్యత్తు కూడా దెబ్బతింటుందన్న ఉద్దేశంలో ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవులను వదులుకుంటున్నారు.

6 నెలల్లో 291 మంది గుడ్ బై
* ఈ మధ్య కాలంలో ఇండిపెండెట్ డైరెక్టర్ పదవిని వదులుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల (ఏప్రిల్ - సెప్టెంబర్) కాలంలో గత ఏడాది ఇదే కాలం తో పోల్చితే ఇండిపెండెట్ డైరెక్టర్ పదవిని వదులుకున్న వారి సంఖ్య రెండింతలకు పైగా ఉంది.
* సెప్టెంబర్ తో ముగిసిన ఆరు నెలల కాలంలో నిఫ్టీ 500 కంపెనీల్లో 291 మంది ఇండిపెండెట్ డైరెక్టర్లు రాజీనామా చేశారని తెలుస్తోంది. గత ఏడాది ఇదే కాలంలో వీరి సంఖ్య 126గా ఉంది.
* పదవీకాలం ముగియగానే కొంత మంది తప్పుకుంటే.. ఇంకొందరు తమ ఆరోగ్యం బాగోలేదని, ప్రయోజనాల వైరుధ్యం తదితర కారణాలను చూపుతూ తమ పదవుల నుంచి తప్పుకున్నారు.
* కంపెనీల మాజీ ఎగ్జిక్యూటివ్ లు, మాజీ ప్రభుత్వ అధికారులు, ఇతర నిపుణులు ఇండిపెండిట్ డైరెక్టర్ పదవులకు దూరంగా ఉంటున్నారు. కార్పొరేట్ కంపెనీలపై విశ్వాసం సన్నగిల్లడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్న మాట.
* ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవిలో ఉన్న రిస్క్ ను దృష్టిలో ఉంచుకొనే దూరం దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

స్వతంత్రత ఎక్కడ ?
* కంపెనీల చట్టం ప్రకారం కంపెనీల్లో కనీసం ఇద్దరు ఇండిపెండెట్ డైరెక్టర్లు ఉండాలి.
* వీరు కంపెనీకి మార్గదర్శిగా, కోచ్ గా, మెంటర్ గా వ్యవహరించాల్సి ఉంటుంది.
* కంపెనీ విశ్వసనీయత, పాలనా ప్రమాణాలు పెంపొందించడంలో కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది.
* మైనారిటీ వాటా దారుల ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేయాలి.
* యాజమాన్యం సక్రమంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలి.
* కానీ ఇవన్నీ ఇండిపెండెట్ డైరెక్టర్ల చేతులో లేకుండా పోతున్నాయి. కుటుంబ వ్యాపారాల్లో అయితే ఇండిపెండెట్ డైరెక్టర్లకు మరిన్ని సవాల్ ఎదురవుతున్నాయి. పోగా వారు చేసే కార్యకలాపాలకు భాద్యులు కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్ పదవి అంటేనే జడుసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications