Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న వేళ.. దేశమంతా త్రివర్ణ పతాక కాంతుల మధ్య వెలుగులతో నిండిపోయింది. వీధులు, ఇళ్లు, కార్యాలయాలు.. ఎక్కడ చూసినా జాతీయ జెండాల సౌందర్యం, దేశభక్తి గీతాల మధురంతో హోరెత్తిపోతోంది. 1947 ఆగస్టు 15న దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుండి భారతదేశం విముక్తి పొందింది. ఆ చారిత్రాత్మక రోజు నుంచి ప్రతి సంవత్సరం ఈ వేడుక దేశభక్తి, ఐక్యత, త్యాగాల పట్ల గౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది.
అయితే ఈ ఏడాది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం..ఇది 78వదా? లేక 79వదా? అనే అయోమయం చాలామందిలో కలుగుతోంది. ఇందులో భాగంగానే చాలామంది తీసి వేత లెక్కలు వేస్తుంటారు.. అంటే 2025 నుండి 1947ని తీసేస్తారు. అప్పుడు వచ్చే సంఖ్య 78. కాబట్టి ఇది 78వ వేడుక అని భావిస్తుంటారు. అయితే ఇది తప్పు. ఈ ఈ లెక్క స్వాతంత్ర్యం పూర్తయిన సంవత్సరాలను మాత్రమే చూపిస్తుంది. వేడుకల సంఖ్యను కాదని గమనించాలి.
సరైన గణన ప్రకారం మనం చూసుకున్నట్లయితే.. 1947 - మొదటి స్వాతంత్ర్య దినోత్సవం, 1948 - 2వ స్వాతంత్ర్య దినోత్సవం అలాగే 2024 - 78వ స్వాతంత్ర్య దినోత్సవం, ఇక 2025 - 79వ స్వాతంత్ర్య దినోత్సవంగా మనం చూడాలి. దీని సులభంగా గణించాలంటే..2025 - 1947 + 1 = 79 ఇలా లెక్కించుకుంటూ పోవాలి. ఇది కేవలం స్వాతంత్ర్య దినోత్సవం మాత్రమే కాకుండా రిపబ్లిక్ డే, ఆర్మీ డే వంటి వార్షికోత్సవాలకు కూడా ఇదే మాదిరిగా వర్తిస్తుంది.

2025 స్వాతంత్ర్య దినోత్సవ థీమ్ ఉమ్మడి వారసత్వం, ఐక్యత గర్వంగా రెడీ అయింది. ప్రజల్లో దేశభక్తి, జాతీయ ఐక్యతను ముఖ్యంగా యువతలో పెంచే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ, దేశం సాధించిన పురోగతిని ఈ పండుగ నాడు జరుపుకుంటుంది.
ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్దకు చేరుకుంటారు. రక్షణ మంత్రి, రక్షణ శాఖ సహాయ మంత్రి, రక్షణ కార్యదర్శి స్వాగతం పలుకుతారు. ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GoC) ప్రధానమంత్రిని సెల్యూటింగ్ బేస్‌కి తీసుకెళ్తారు.అక్కడ అంతర్-సర్వీసెస్, ఢిల్లీ పోలీస్ గార్డ్ సంయుక్తంగా జనరల్ సెల్యూట్ సమర్పిస్తారు. అనంతరం ప్రధానమంత్రి గార్డ్ ఆఫ్ ఆనర్‌ను స్వీకరిస్తారు. అనంతరం ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. తరువాత దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
దేశవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు, గల్లీల్లో జెండా ఆవిష్కరణ, దేశభక్తి గీతాలు, క్రీడా పోటీలు ఈ దినోత్సవం నాడు జరుగుతాయి. పిల్లలు చిత్రలేఖన పోటీలు, యువత సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తారు. కొన్ని కుటుంబాలు ఈ రోజున స్వాతంత్ర్య సమరయోధుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications