IPO News: నేడు ప్రారంభమౌతున్న ఐపీవో.. బెట్టింగ్ వేయాలా..? వద్దా..?
Indegene IPO: కొత్త వారం ఐపీవోల కోలాహలం మెుదలైంది. ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఇండిజీన్ కంపెనీ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుకుంది. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడిదారులు దీనిలో పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే అయోమయంలో ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఐపీవోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నేడు ఓపెన్ అయిన ఇండిజీన్ మే 8న ముగియనుంది. ఈ క్రమంలో కంపెనీ తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.430-452గా నిర్ణయించింది. పైగా లాట్ పరిమాణాన్ని మెయిన్ కేటగిరీ ఐపీవో 33 షేర్లుగా ఉంచింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.1,841.76 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో రూ.760 కోట్లకు తాజా ఈక్విటీ షేర్ల విక్రయం ఉండగా.. 2,39,32,732 ఈక్విటీ షేర్లను ప్రస్తుతం షేర్ హోల్డర్లు, ప్రమోటర్లు ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయిస్తున్నారు. ఇదే క్రమంలో కంపెనీ ఐపీవోలో పాల్గొనాలనుకునే తన ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.30 తగ్గింపును ప్రకటిస్తూ వారి కోసం రూ.12.5 కోట్లు విలువైన షేర్లను ఇప్పటికే రిజర్వు చేసింది.

1998లో స్థాపించబడిన ఇండిజీన్ కంపెనీ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ కోసం డిజిటల్ సేవలను అందించింది. కంపెనీ ఔషధాల అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్, రెగ్యులేటరీ ఫైలింగ్స్, ఫార్మాకోవిజిలెన్స్, ఫిర్యాదుల నిర్వహణ వంటి సేవలను అందిస్తోంది. కంపెనీ ఓమ్నిచానెల్ యాక్టివేషన్ ఎంటర్‌ప్రైజ్ మెడికల్ సొల్యూషన్స్; ఎంటర్ప్రైజ్ క్లినికల్ సొల్యూషన్స్ అండ్ కన్సల్టెన్సీ, వ్యాపార వాణిజ్య పరిష్కారాలను అందిస్తుంది. కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక్కో షేరును రూ. 452 ధరకు అలాట్ చేసి రూ.548.78 కోట్లను సమీకరించింది. ఇందులో మార్క్యూ ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ వరల్డ్ ఫండ్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, అమెరికన్ ఫండ్స్ ఇన్సూరెన్స్, కస్టడీ బ్యాంక్ ఆఫ్ జపాన్, డెస్టినేషన్స్ ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్‌తో పాటు ఇతరులు యాంకర్ బుక్‌లో పాల్గొన్నారు.
డిసెంబరుతో ముగిసిన 9 నెలల కాలానికి కంపెనీ ఆదాయం రూ.1,969.75 కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలో రూ.241.90 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.266.10 కోట్లుగా ఉంది.
ఐపీవోపై బ్రోకరేజ్ సంస్థలు, రీసెర్చ్ సంస్థల అభిప్రాయాన్ని పరిశీలిస్తే..
ఆనంద్ రాఠీ రీసెర్చ్: ఐపీవోకు Subscribe చేయమని సూచించింది
రిలయన్స్ సెక్యూరిటీస్: ఐపీవోకు Subscribe చేయమని సూచించింది
ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్: ఐపీవోకు Subscribe చేయమని సూచించింది
ఎస్ఎమ్ఐఎఫ్ఎస్: ఐపీవోకు Subscribe చేయమని సూచించింది
స్వస్తిక్ ఇన్వెస్ట్ మార్ట్: ఐపీవోకు Subscribe చేయమని సూచించింది
స్టాక్ బాక్స్: ఐపీవోకు Subscribe చేయమని సూచించింది
ఇండ్సెక్ రీసెర్చ్: ఐపీవోకు Subscribe చేయమని సూచించింది


Click it and Unblock the Notifications