IPO News: గ్రేమార్కెట్లో తుఫాను సృష్టించిన ఐపీవో.. బెట్టింగ్ వేసేందుకు గెట్ రెడీ ఇన్వెస్టర్స్..
Indegene IPO: వచ్చే నెల దేశీయ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు కొన్ని కంపెనీలు తమ ఐపీవోలను సిద్ధం చేస్తున్నాయి. గత రెండేళ్లుగా దేశంలోని ఇన్వెస్టర్లు ఈక్విటీల కంటే ఐపీవోలపైనే ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్న సంగతి తెలిసిందే. వారి అంచనాలకు తగినట్లుగానే చాలా 90 శాతానికి పైగా ఐపీవోలు లిస్టింగ్ సమయంలోనే పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే త్వరలో ఇండెజీన్ కంపెనీ తన ఐపీవోను మార్కెట్లోకి తీసుకొస్తోంది. వచ్చే నెలలో ఇది సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబోతోంది. ఈ కంపెనీకి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు - కార్లైల్ అండ్ నడతుర్ ఫారెస్ట్ మద్దతు ఇస్తున్నాయి. ఫార్మా రంగంలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయిన ఇండెజీన్ ఐపీవో మే 6, 2024న రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభించబడుతోంది. ఇది మే 8న ముగియనుంది.

తాజా ఐపీవో ద్వారా ఇండెజీన్ కంపెనీ మార్కెట్ల నుంచి రూ.760 కోట్లకు తాజా ఇష్యూతో పాటు 2.39 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించాలని చూస్తోంది. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ విభాగంలో మే 13న లిస్టింగ్ అవనున్న ఐపీవో షేర్ల కేటాయింపు మే 9న జరగనుందని తెలుస్తోంది. కంపెనీ తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను ఇప్పటికీ ప్రకటించనప్పటికీ గ్రేమార్కెట్లో మాత్రం ఒక్కో షేరు ప్రీమియం రూ.160గా ఉంది.
దేశంలోని ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నడతుర్ ఎస్ రాఘవన్ యాజమాన్యంలోని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ Nadathur FarEast Pte Ltd ఇండెజీన్‌లో 23.64 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. 1998లో స్థాపించబడిన ఈ కంపెనీ యూకే, అమెరికా, యూరప్, చైనా, జపాన్, ఇండియాలో వ్యాపారాన్ని కలిగి ఉంది. మార్చి 31, 2022-మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరాల మధ్య కంపెనీ ఆదాయం 39.85 శాతం, పన్ను తర్వాత లాభం(PAT) 63.43 శాతం పెరిగాయి.


Click it and Unblock the Notifications