Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం రోజున ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ కోసం తెరుచుకున్నాయి. అనుకోని పరిస్థితుల్లో మెయిన్ సైట్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైట్ కి స్విచ్చింగ్ పరీక్షించటం లక్ష్యంగా నేడు లైవ్ ట్రేడ్ నిర్వహించబడుతోంది.
ఉదయం 9.27 గంటల సమయంలోని మెుదటి ట్రేడింగ్ సెషన్లో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 92 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 43 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 52 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 298 పాయింట్ల లాభంతో స్పెషల్ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అయితే ఈరోజు తక్కువ వాల్యూమ్స్ ట్రేడింగ్ కారణంగా వోలటాలిటీ తక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

నేటి ట్రేడింగ్ సెషన్లో ఎన్ఎస్ఈలో పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, హిందాల్కొ, నెస్లే, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, సిప్లా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, టీసీఎస్, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, దివీస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని స్పెషల్ ట్రేడింగ్ మెుదటి సెషన్లో కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications