Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గత నెలరోజులుగా మార్కెట్లు అందించిన లాభాలను స్వీకరించేందుకు మెుగ్గుచూపటంతో సూచీలు చతికిలపడ్డాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ 542 పాయింట్లు కోల్పోయింది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ 145 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ ముగించింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 482 పాయింట్లు నష్టపోయినప్పటికీ.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 94 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ ఇంట్రాడే రెండవ సెషన్ ట్రేడింగ్ సమయంలో మార్కెట్లు అధికంగా నష్టాలను నమోదు చేశాయి.

ప్రపంచ మార్కెట్లలో నష్టాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, US బాండ్ ఈల్డ్‌లు పెరగడం కూడా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. మార్కెట్ ఫ్లాట్‌గా అమ్మకాలు కొనసాగించడంతో హెవీవెయిట్ షేర్లు నష్టాలను చవిచూశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, రియాల్టీ, మెటల్ షేర్లలో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి. అయితే మొదటి త్రైమాసిక ఆదాయ నివేదిక ద్వారా ఫార్మా స్టాక్స్‌కు మద్దతు లభించింది. ఇదే క్రమంలో మీడియా, హెల్త్‌కేర్ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ఇదే సమయంలో బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారతదేశ రేటింగ్‌ను 'అధిక బరువు'కి అప్‌గ్రేడ్ చేసింది. కానీ ఈ సానుకూల ప్రభావం మార్కెట్‌లో కనిపించలేదు.
NSEలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, హిందాల్కొ, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ టిఐఎమ్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఇదే క్రమంలో టైటాన్, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోల్ ఇండియా, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టి, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications