ఏ పద్దులో రాయాలబ్బా... ప్రభుత్వాలకు కరోనా లెక్కల తకరారు!

కరోనా వైరస్ ఏమో కానీ ప్రజలంతా తెగ తికమక పడిపోతున్నారు. ఇప్పటికే 20 రోజులకు పైగా ఇంటి పట్టునే ఉండి ఎప్పుడెప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తారా... ఎంచక్కా రోడ్లపైకి వచ్చేద్దామా అని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వాలేమో... దండం పెడతాం బాబులూ మీరెవరూ బయటకు రాకండి. అవసరమైతే మేమే మీ ఇంటికి వచ్చి కావలసిన సరుకులు, సేవలను కూడా అందిస్తామని ప్రాధేయ పడుతున్నాయి.

ఇప్పటి వరకు ప్రజలు అడుక్కోవటం... ప్రభుత్వాలు ఇచ్చుకోవటాలు చూసాం. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో అన్నీ తారుమారవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలే అడుక్కుంటున్నాయి. అదేనండి ఇంట్లోనే ఉండి మిమ్మల్ని కాపాడుకోవటంతో పాటు రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మీదేనని పౌరులకు సూచిస్తున్నాయి.

ఇందుకోసం పోలీసులు, మున్సిపల్ డిపార్ట్మెంట్లు సహా ఇతర ప్రభుత్వ యంత్రాంగమంతా అహర్నిశలు కృషి చేస్తున్నాయి. మరో వైపు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా సోకిన వారికి, అనుమానితులకు వైద్యం అందిస్తూ ... డాక్టర్లంటే నిజంగానే దేవుళ్ళు అని రుజువు చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వాలకే పెద్ద ఇబ్బంది వచ్చి పడింది.

రూ వేల కోట్ల లో ఖర్చు...

రూ వేల కోట్ల లో ఖర్చు...

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ అందరూ ఇండ్లలో ఉంటే ప్రజలు బతికేదెలా? అందుకే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 84 లక్షల కుటుంబాలకు రూ 1,500 నగదు, 12 కిలోల బియ్యం అందించారు. ఇవి కాకుండా ఇతరత్రా వైద్య పరికరాలు, వైద్య సేవలు, మందులు, చికిత్సకు అయ్యే ఖర్చులు, మాస్కులు, వెంటిలేటర్లు, అంబులెన్సు సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. కానీ, ఇంత భారీ ఖర్చు ఏ పద్దులో చూపాలో తెలియక ఆర్థిక శాఖ తలపట్టుకుంటోంది. ఇది ఒక్క ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు.

దేశంలోని అన్ని రాష్ట్రాలు రూ వేల కోట్లలో కరోనా నియంత్రణ, ప్రజల సంక్షేమం కోసం వెచ్చిస్తున్నాయి. కానీ, ఈ నిధుల ఖర్చుకు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు ఉండవు. అత్యవసర విపత్తు పద్దులో చూపుతారు. కానీ ఇప్పటి వరకు మన దేశంలో ఒక ప్రకృతి విపత్తు కానీ, ఇతర విపత్తు కానీ ఇంత కాలం కొనసాగింది లేదు. అలాగే ఇంత భారీ ఖర్చు అయింది కూడా లేదు. అందుకే ఈ ఖర్చును ఎలా చూపాలో ప్రభుత్వాలకు అంతుచిక్కని వ్యవహారంలా తయారయ్యింది.

మినీ బడ్జెట్...

మినీ బడ్జెట్...

మన భారత దేశ వార్షిక బడ్జెట్ సుమారు రూ 30,00,000 కోట్లు ఉంటుంది. కానీ కరోనా వైరస్ పుణ్యమా అని అందులో దాదాపు 10% నిధులు ఇప్పుడు ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఖర్చు మాత్రమే. ఇక అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిధులను కూడా పరిగణన లోకి తీసుకుంటే ఇది రెట్టింపు కావటం ఖాయం.

అంటే ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ నియంత్రకు వెచ్చించే మొత్తం మరో మినీ బడ్జెట్ ను తలపిస్తోంది. మొత్తం బడ్జెట్ లో 20% నికి సమానంగా ఉండటంతో... కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతా ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు కొన్ని మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి. త్వరలో ఇది జరిగినా జరగొచ్చు.

అందుకే రిలీఫ్ ఫండ్...

అందుకే రిలీఫ్ ఫండ్...

రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకు ఒక కంటింజెంట్ ఫండ్ (నిధి) ఉంటుంది. అనివార్య కారణాల వల్ల అవి మన దేశంలో పూర్తి స్థాయిలో రూపం దాల్చట్లేదు. అందుకే రాష్ట్రాల్లో సీఎం రిలీఫ్ ఫండ్, కేంద్రంలో పీఎం రిలీఫ్ ఫండ్ ల పేరుతో కొంత ప్రభుత్వం నుంచి, మరికొంత దాతల నుంచి నిధులను సమీకరించి ఒక ఆపత్కాల నిధిని ఏర్పాటు చేసుకుంటారు.

ఐతే ప్రస్తుతం ఆ నిధులు కరోనా వైరస్ దెబ్బకు ఏమాత్రం సరిపోవటం లేదు. అందుకే ఇటీవల మళ్ళీ దాతల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరిస్తున్నారు. మరో వైపు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్ ) కింద ఖర్చు చేసే నిధులను కూడా ఇందుకు అనుమతిస్తున్నారు. దీంతో కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నాయి. అయినా సరే ఈ నిధులు కూడా ఏ మూలకూ సరిపోవు. పైగా రాష్ట్రాలకు ఆదాయాలు పడిపోవటంతో కొత్త అప్పులు చేయాల్సిన గత్యంతరం కరోనా వైరస్ కల్పించింది. అందుకే ఇప్పుడు కరోనా పద్దు అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+